ETV Bharat / state

కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ...

author img

By

Published : Sep 19, 2019, 7:47 PM IST

తెలంగాణ యువజన కమిషన్​ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు, మోసపూరిత వైఖరిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆక్షేపించారు.

రేవంత్​ రెడ్డి
'రాష్ట్ర యువజన కమిషన్​ ఏర్పాటు చేయండి'

తెలంగాణ ఉద్యమ చరిత్ర చూస్తే అడుగడుగునా యువత పోరాటాలు, త్యాగాలే కనిపిస్తాయని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. పోలీసు తూటాలు-లాఠీలకు ఎదురొడ్డి స్వరాష్ట్ర సాధనలో వారు చూపిన తెగువ ఎప్పటికీ మరపురానిదని, మరువలేనిదన్నారు. వందల ప్రాణాలు, లక్షలాది యువత త్యాగాలతో స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన విషయం కాదనలేని నిజమని చెప్పారు. కానీ కేసీఆర్ ఐదున్నర ఏళ్ల పాలనలో యువతను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో యువత సమస్యల పరిష్కారానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వేదిక అవసరమని రేవంత్ అభిప్రాయపడ్డారు. అందుకే రాష్ట్ర యువజన కమిషన్​ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

revanth-reddy-wrote-a-letter
లేఖ

ఇవీ చూడండి: చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య

TG_Hyd_56_19_Revanth_Letter_to_CM_AV_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) కేసీఆర్ ఐదున్నర ఏళ్ల పాలనలో యువతను మోసం చేశారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు. ఈ మేరకు అయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను మోసపూరిత వైఖరిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపారని ఆక్షేపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం యువతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో రాష్ట్ర యువజన కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వరాష్ట్రంలో యువత నిర్లక్ష్యానికి గురవుతోందని పేర్కొన్నారు. కేంద్ర కార్మిక ఉపాధిశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ దేశంలో యువతకు ఉపాధి పుష్కలంగా ఉన్నాయని చెప్పారని తెలిపారు. యువతలో నైపుణ్యాలను మెరుగు పరిచి సరైన దిశానిర్దేశం చేస్తే ఏదైనా సాధించగలరన్నారు. యువత సమస్యలపై మేధోమథనం జరగాలన్నారు.స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వేదిక తెలంగాణ రాష్ట్ర యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని ఇందుకోసం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించి చట్టం తీసుకురావాలని వివరించారు end

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.