ETV Bharat / state

Revanth Reddy VS KTR Tweet War : మీ కల్వకుంట్ల స్కామ్‌ల గురించీ చెప్పండి.. కేటీఆర్​కు రేవంత్ రెడ్డి కౌంటర్ - కేటీఆర్​పై రేవంత్ రెడ్డి ట్వీట్

Revanth Reddy VS KTR Tweet War : కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం కొత్తగా రాజకీయ ఎన్నికల పన్ను విధిస్తోందని.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ స్కాంల వారసత్వంతో స్కాంగ్రెస్​గా మారిపోయిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అదే స్థాయిలో బదులిచ్చారు.

Congress MP Komatireddy  Venkat Reddy Counter to KTR
Revanth Reddy Fires on KTR Through Twitter
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 6:51 PM IST

Revanth Reddy VS KTR Tweet War : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పోటీపడుతూ రాజకీయ కదన రంగంలో పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హామీలను ప్రకటించి.. ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్​పై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు అదే స్థాయిలో ప్రతిస్పందించారు.

KTR on Telangana Congress Six Guarantees : 'గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కాంల వారసత్వంతో స్కాంగ్రెస్ అయింది'

కాంగ్రెస్​ను విమర్శిస్తూ కేటీఆర్​ ట్వీట్​ చేయగా.. కాంగ్రెస్​ నేతలు రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిలు కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను చూసి కేసీఆర్​కు చలి జ్వరం పట్టుకుంటే.. కేటీఆర్(KTR)​ ఏమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేదంటూ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రంపై గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో కల్వకుంట్ల స్కామ్‌ల గురించి చెప్పాలన్నారు.

TPCC President Revanth reddy Tweet on KTR : దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నామని.. స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్న సంగతి గురించి చెప్పాలంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్​ను నిలదీశారు. లిక్కర్ స్కామ్​లో కేటీఆర్ చెల్లి కవిత రూ.300 కోట్లు వెనకేసుకుందని.. దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పాలన్నారు. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన సాగటం లేదని.. కాగ్ స్పష్టం చేసిన విషయం గురించి చెప్పాలంటూ దుయ్యబట్టారు.

LIVE UPDATES : తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను తమ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టారో.. ఎంత మంది తమ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో.. ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు తమ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో.. అన్నీ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. లెక్కలతో సహా తేలుస్తామన్నారు. ఈ క్రమంలోనే 'కాంగ్రెస్​ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ తండ్రి(KCR) వల్ల కూడా కాద'ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

  • కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నడు.

    నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది?

    పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి,
    తెలంగాణలో మీ… https://t.co/8UceqyxnLD

    — Revanth Reddy (@revanth_anumula) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Congress MP Komatireddy Venkat Reddy Counter to KTR : రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ను లూట్‌, సూట్‌ సర్కారుగా ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ.. కే టాక్స్‌ వసూలు చేయడానికి అలవాటు పడిందని విమర్శించారు. కే టాక్స్‌ రూపంలో రూ.1000 కోట్లు వసూలు చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ ఎజెండా ఫ్యామిలీ ఫస్ట్‌ అని.. ప్రజలు లాస్ట్‌ అంటూ విమర్శలు గుప్పించారు.

గత 9 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ ఇదే చేస్తోందని ధ్వజమెత్తారు. ఫేక్ యువరాజు కేటీఆర్‌ కార్పొరేట్​లను దోచుకుంటున్నారని.. కేసీఆర్‌ ప్రజలను వంచనకు గురి చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో రూ.900 కోట్లు.. వారి బినామీల అకౌంట్‌లలో రూ.90 వేల కోట్లు జమ చేసుకున్నారని ఆరోపించారు. 2024లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అవినీతిపరులను జైలుకు పంపడం ఖాయమని స్పష్టం చేశారు.

  • Feku Yuvraj @KTRBRS loots all the suits(corporates), Deceitful Dad, ditches the people, having ₹900crs in party bank accounts & ₹90k crs in benami accounts.

    No matter how much they loot, congress govt in 2024 will show them their right place which is JAIL.

    Jai Congress

    — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

MP Komati Reddy on Power Cuts in Telangana : 'తెలంగాణలో కరెంట్ కోతల్లేవా.. నాతో రండి చూపిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.