ETV Bharat / state

Revanth Tweet on Munugode By Poll Result : 'రాజకీయాల్లో గెలుపోటములు సహజం' - Revanth Tweet on Munugode By Poll Result

Revanth Tweet on Munugode By Poll Result : రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు నిన్న వెలువడ్డాయి. కమలదళాన్ని వెనక్కి నెట్టి గులాబీ దళం ఈ ఎన్నికలో విజయాన్ని నమోదు చేసుకుంది. తెరాస-భాజపా మధ్య సాగిన ఈ ఉత్కంఠ పోరులో గులాబీ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా డిపాజిట్‌నే కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ట్విటర్ వేదికగా వెల్లడించారు.

Revanth Tweet on Munugode By Poll Result

author img

By

Published : Nov 7, 2022, 7:52 AM IST

Revanth Tweet on Munugode By Poll Result: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా ఎగిరింది. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా డిపాజిట్‌నే కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమని తెలిపారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతతో పని చేసిన ప్రతి కార్యకర్తకు.. నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నానని రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

  • రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నది ముఖ్యం.

    మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతగా పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

    — Revanth Reddy (@revanth_anumula) November 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్‌కు తొలిసారి అతితక్కువ ఓట్లు: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 48.9 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌ ఈసారి 10.6 శాతానికి దిగజారింది. మునుగోడు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన 12 ఎన్నికల్లో 10 సార్లు కాంగ్రెస్‌ పోటీ చేయగా తొలిసారిగా అతి తక్కువ ఓట్లు వచ్చాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 97,239 ఓట్లు రాగా ఈసారి 23,906కు పరిమితమైంది.

నాడు స్వతంత్ర అభ్యర్థిగా 27,441 ఓట్లు: 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన స్రవంతికి 27,441 ఓట్లు రాగా ఈసారి కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగగా 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇవీ చదవండి: Congress Deposit Loss: కాంగ్రెస్‌కు షాక్‌... మునుగోడులో హస్తం గల్లంతు

Munugode bypoll: మునుగోడు 'గులాబీ' వశం.. ఫలించిన కేసీఆర్‌ వ్యూహం..!

'ఆ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని మోదీ ఒత్తిడి తెచ్చారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.