Revanth Reddy Serious About Aleru Constituency Party activists : గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు అక్కడ ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. నేడు కూడా రేవంత్ రెడ్డి గాంధీభవన్‌కు వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ.. ఆయన కంటికి కనిపించారు. దీంతో నిరసనలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు.. వారిపై తీవ్రంగా స్పందించారు.
ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు వివరణ ఇస్తూ.. ఆలేరు నియోజకవర్గంలో 8 ఉండగా.. అందులో 7 ఆ నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు చెప్పిన వాళ్లకే ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన ఒక్క మండలం మహిళకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ఆందోళన విరమించకుంటే సస్పెండ్ చేసేందుకు వివరాలు సేకరించాలని గాంధీభవన్ ఇంఛార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావుకు ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెండ్నే : తుర్కపల్లి మండల నేతలు వెంటనే ధర్నా ఆపేయాలని నియోజవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్యకు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు గాంధీభవన్ మెట్లపై ధర్నా చేసే వారి వివరాలు సేకరించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావును పీసీసీ ఆదేశించింది. మొన్నటివరకు మండల కమిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న శంకర్ నాయక్‌ను సస్పెండ్ చేయాలని రేవండ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవని.. వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి సూచించారు.
Revanth Reddy Fires On Congress Aleru Constituency : కమిటీల నియామకంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. పార్టీ ఆర్గనైసింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డిలకు వినతి పత్రం ఇవ్వాలని రేవంత్ స్పష్టం చేశారు. ఆ వినతులపై పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలియజేశారు.
మునుగోడు, భువనగిరిలో మొదలైన సమస్య : కాంగ్రెస్‌లో మండల కమిటీల నియామకాలు పార్టీలో కాకపుట్టించాయి. గత వారం చిన్నగా మొదలైన లొల్లి.. ఇప్పుడు తీవ్రసమస్యగా మారింది. మునుగోడు, భువనగిరి నియోజవర్గాలతో షురూ ఐనా సమస్య.. గజ్వేల్, ఖానాపూర్, ఖమ్మం, రామగుండ, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, మహేశ్వరం, కల్వకుర్తి, ఆలేరు, కోదాడ, సిద్దిపేట, నారాయణఖేడ్, జనగామ, పాలకుర్తి, ఎల్లారెడ్డి, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పెను దుమారమే సృష్టించింది. ఈ నియోజకవర్గాల నాయకులు.. గాంధీభవన్‌కు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు.
ఇవీ చదవండి :