లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతోన్న వారికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద భోజనం అందిస్తామని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రోజూ వెయ్యి మంది వైద్య సిబ్బంది, కరోనా బాధితులు, వారి బంధువులకు ఉచిత భోజనం అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం కనీసం కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులకు ఆహారం ఏర్పాటు చేయలేదని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. విపత్తు వేళ కార్పొరేట్ ఆసుపత్రులు కాసులు దండుకోవడమే లక్ష్యంగా పనిచేయడం దారుణమని ఎంపీ మండిపడ్డారు.
ఇదీ చూడండి: కొవిడ్ బాధితులకు పోలీసుల సాయం.. ఇంటివద్దకే భోజనం