ETV Bharat / state

Revanth Reddy on Karnataka Results : 'నిన్న హిమాచల్.. నేడు కర్ణాటక.. రేపు​ తెలంగాణ' - Revanthreddy on Karnataka Results

Revanth Reddy on Karnataka Results : కర్ణాటక ఫలితాలు రాష్ట్రంపై ప్రభావితం చూపుతాయని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. వీటిపై రాహుల్‌గాంధీ జోడో యాత్ర ప్రభావం కనిపిస్తోందని వివరించారు. నిన్న హిమాచల్, నేడు కర్ణాటక, రేపు తెలంగాణ అని ఆయన పునరుద్ఘాటించారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : May 13, 2023, 5:41 PM IST

Updated : May 13, 2023, 6:23 PM IST

Revanth Reddy on Karnataka Results : కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపొందడంతో రాష్ట్రంలోనూ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్​లో సందడి వాతావరణం నెలకొంది. పెద్దసంఖ్యలో గాంధీభవన్​కు చేరుకున్న హస్తం కార్యకర్తలు, నాయకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​కి.. రేవంత్​రెడ్డి ఫోన్​ చేసి అభినందనలు తెలిపారు.

మత రాజకీయాలను తిరస్కరించారు : కాంగ్రెస్ మతాన్ని రాజకీయాలకు వాడుకోదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కానీ బీజేపీ మత రాజకీయలతో కర్ణాటకలో అధికారంలోకి రావాలనుకుందని ఆరోపించారు. దీనిని అక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎత్తుగడలను ఓటర్లు చిత్తు చేశారని అన్నారు. జేడీఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ చూశారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేటీఆర్‌కు ఇష్టం లేదని రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు.

కర్ణాటక ఫలితాలు రాష్ట్రంపై ప్రభావితం చూపుతాయని రేవంత్​రెడ్డి వివరించారు. వీటిపై రాహుల్‌గాంధీ జోడో యాత్ర ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. నిన్న హిమాచల్, నేడు కర్ణాటక, రేపు తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాహుల్​గాంధీపై అనర్హత వేటు అక్కడి ప్రజలకు నచ్చలేదని పేర్కొన్నారు. అదానీ అవినీతిపై మాట్లాడినందుకు ఆయనపై కక్ష కట్టారని రేవంత్​రెడ్డి ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయి : ఇందులో భాగంగానే రాహుల్​గాంధీ ఇంటిని ఖాళీ చేయించారని.. మరీ మాజీ ఎంపీ గులాంనబీ అజాద్ ఇళ్లు ఎందుకు ఖాళీ చేయించలేదని రెేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. మోదీ ఓడిపోతే భారత్​ రాష్ట్ర సమితి ఎందుకు బాధ పడుతోందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు భావిస్తున్నారని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నామని ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపిస్తాయని అన్నారు. అక్కడి ప్రజలు మతతత్వ రాజకీయాలను తిరస్కరించారని వివరించారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్​కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

"మత రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. కేసీఆర్ ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు చిత్తు చేశారు. కర్ణాటక ఎన్నికలు తెలంగాణపై ప్రభావితం చూపుతాయి. నిన్న హిమాచల్, నేడు కర్ణాటక, రేపు తెలంగాణ. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేటీఆర్‌కు ఇష్టం లేదు. మోదీ ఓడిపోతే బీఆర్​ఎస్​ ఎందుకు బాధ పడుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు భావిస్తున్నారు." - రేవంత్‌రెడ్డి, టీపీసీ అధ్యక్షుడు

నిన్న హిమాచల్.. నేడు కర్ణాటక.. రేపు​ తెలంగాణ

ఇవీ చదవండి : Revanthreddy on Karnataka Results : 'మేం అనుకున్న ఫలితాలే వచ్చాయి.. తెలంగాణలోనూ రిపీట్​ అవుతాయి'

కర్ణాటక పీసీసీ చీఫ్​ డీకే శివ కుమార్ తీవ్ర భావోద్వేగం.. ప్రజలకు థ్యాంక్స్​ చెబుతూ..

Last Updated : May 13, 2023, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.