ETV Bharat / state

బయ్యారం మర్చిపోయారు.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు: రేవంత్‌రెడ్డి

Revanth Reddy reaction on central budget 2023: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంలో బీజేపీ , బీఆర్ఎస్ ఇద్దరూ దోషులేనని విమర్శించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 1, 2023, 7:20 PM IST

Revanth Reddy reaction on central budget 2023 : దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజాసంక్షేమం పట్టకుండా కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో గెలవాలన్న ప్రాతిపదికన కేటాయింపులు చేశారని.. దేశ ఆర్థికాభివృద్ధిపై ఎలాంటి స్పష్టత లేకుండా నిధులు కేటాయించారని మండిపడ్డారు.

బడ్జెట్​లో తెలంగాణకు ఇచ్చిన కేటాయింపులు చూశాక తీవ్ర నిరాశ ఆవహించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపిందన్నారు. విభజన హామీల అమలుకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కల్పిస్తామన్న హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని ఫైర్ అయ్యారు.

బడ్జెట్‌లో ఐటీఐఆర్ కారిడార్‌ ప్రస్తావనే లేదన్న రేవంత్ రెడ్డి... పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణకు జరిగిన అన్యాయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ దోషులే అని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన వాటిని కేసీఆర్ సాధించలేదని విమర్శించారు.

" బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. అసలు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు. తెలంగాణకు నిధులు ఇస్తారనుకుంటే నిరాశే ఎదురైంది. తెలంగాణకు జరిగిన అన్యాయంలో బీజేపీ , బీఆర్ఎస్ ఇద్దరూ దోషులే. తెలంగాణకు రావాల్సిన వాటిని కేసీఆర్ సాధించలేదు. - రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

అసలు తెలంగాణకు బడ్జెట్‌లో కేటాయించినవి... దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌2023ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..

ఏపీ సంస్థలకు కేటాయింపులు.. ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి - రూ. 47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీ - రూ. 168 కోట్లు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రూ. 683 కోట్లు కేటాయించారు. తెలంగాణ సంస్థలకు కేటాయింపులు.. సింగరేణి - రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌ - 300 కోట్లు, మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు కేటాయించారు.

తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు.. రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు, మంగళగిరి, బిబినగర్‌ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు - రూ. 6,835 కోట్లు, సాలార్జంగ్‌ సహా అన్ని మ్యూజియాలకు - రూ. 357 కోట్లు కేటాయించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.