ETV Bharat / state

ఉస్మానియా వర్సిటీ కేంద్రంగా వేడెక్కుతోన్న రాజకీయం.. కోర్టుకెళ్లిన కాంగ్రెస్​

తెలంగాణలో ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. యూనివర్సిటీలోకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం హాట్‌హాట్‌గా మారుతోంది. అక్కడ అడుగు పెట్టకుండానే తెరాస, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉస్మానియాలో రాహుల్ సభకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్‌ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కాంగ్రెస్‌ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.

ఉస్మానియా వర్సిటీ కేంద్రంగా వేడెక్కుతోన్న రాజకీయం.. కోర్టుకెళ్లిన కాంగ్రెస్​
ఉస్మానియా వర్సిటీ కేంద్రంగా వేడెక్కుతోన్న రాజకీయం.. కోర్టుకెళ్లిన కాంగ్రెస్​
author img

By

Published : May 2, 2022, 11:30 AM IST

Updated : May 2, 2022, 12:48 PM IST

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఒకప్పుడు ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన విశ్వవిద్యాలయం నుంచే తెరాసపై దండయాత్ర చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 6న వరంగల్ రైతు సంఘర్షణ సభకు రానున్న రాహుల్ గాంధీని 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందుకోసం ఓయూ వీసీని కలిసి అనుమతి కోరడం, అక్కడ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డికి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావులకు పీసీసీ బాధ్యతను అప్పగించింది. అనుమతి కోరినా.. ఇప్పటి వరకు వీసీ అనుమతి ఇవ్వకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ముఖాముఖికి అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్​: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్‌ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కాంగ్రెస్‌ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 7న విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. మానవతారాయ్‌ సహా నలుగురు పిటిషన్‌ దాఖలు చేయగా... హౌస్‌మోషన్‌ పిటిషన్‌గా తీసుకుని విచారణ జరపాలని కోరారు. ఇప్పటికే ఓయూ ఉపకులపతి అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ పెద్దల ఒత్తిడితోనే అనుమతివ్వడం లేదని ఆక్షేపిస్తున్నారు

గతంలో ఇలా.. వాస్తవానికి ఓయూ విశ్వవిద్యాలయంలో రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించరాదని హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది. 2016 జూన్ 4వ తేదీన తెలంగాణ జనజాతర సమావేశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఓయూలో విద్యా సంబంధ సమావేశాలు తప్ప, రాజకీయ సంబంధిత సమావేశాలకు వేదిక కారాదని హైకోర్టు జూన్ 5వ తేదీన స్పష్టం చేసింది. ఓయు కార్యనిర్వహక కౌన్సిల్ సైతం అక్కడ ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. మైకుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని కూడా తీర్మానం చేసింది. 2020లో చేసిన తీర్మానాలను చూపి ఓయూ అధికారులు రాహుల్ సభకు అనుమతి ఇవ్వకుండా దాటవేస్తున్నారు.

ఓయూలో వేడెక్కుతోన్న వాతావరణం: అయితే ఓయూలో సభకు వీసీ అనుమతి ఇవ్వక పోవడం వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2017లో ఓయూ దశాబ్ధి ఉత్సవాలు జరిగినప్పుడు హాజరైన సీఎం కేసీఆర్‌ను విద్యార్థులు అడ్డుకున్నారని, ఆ తర్వాత సీఎం ఓయూ వెళ్లలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉద్యమకాలంలో కేసీఆర్‌కు అండగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ.. రాష్ట్రం వచ్చాక అక్కడ పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. తెరాసకు ఇబ్బందిగా మారిన చోటకు కాంగ్రెస్‌ను అనుమతిస్తే తమకు ఇబ్బందని భావించిన కేసీఆర్.. అక్కడ రాహుల్ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఓయూ కేంద్రంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

పోటాపోటీగా ఆందోళనలు: ఓయూలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయం రక్తికట్టిస్తున్నారు. కేసీఆర్, కాంగ్రెస్ దిష్టి బొమ్మలు పోటీలు పడి దగ్ధం చేస్తున్నారు. పోటాపోటీగా ఆందోళనలతో యూనివర్సిటీని అట్టుడికిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెరాస, కాంగ్రెస్ నేతలు బాల్క సుమన్, జగ్గారెడ్డి మధ్య మాటలు యుద్దం జరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు శృతి మించుతున్నాయి. రాహుల్ గాంధీ ఓయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని తెరాస డిమాండ్ చేస్తుండగా.. తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీకి అనుమతి ఎందుకు ఇవ్వరని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. అసలు రాహుల్ గాంధీ ఓయూకు వస్తే కేసీఆర్ ఎందుకు భయపడి అడ్డుకుంటున్నారనీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

నిరసనలకు పిలుపునిచ్చిన రేవంత్​: ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ఛాంబర్‌ వద్ద ధర్నా ఘటనలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ సహా 18 మంది విద్యార్థి నాయకుల అరెస్టును టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఖండించారు. వారి అరెస్టులను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని సూచించారు. రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతివ్వట్లేదని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌ సహా 18 మంది అరెస్టు చేశారని.. ఎన్‌ఎస్‌యూఐ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు.

ఓయూలో భారీగా మోహరించిన పోలీసులు: మరోవైపు అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న విద్యార్థి నాయకులను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు మధు యాస్కీ, గీతారెడ్డి వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఇతర ప్రజాప్రతినిధులు ఓయూకు వెళ్లనున్నందున ముందుస్తుగా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల, వీసీ భవనం వద్ద భారీగా మోహరించారు.

పునరాలోచనలో కాంగ్రెస్​: ఓయూ అధికారులు ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడంతో రాహుల్ ఓయూ సందర్శనపై కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. న్యాయస్థానం తీర్పు అనుకూలంగా రాకపోతే హైదరాబాద్ నగరంలో 7వ తేదీ రాహుల్ పర్యటనలో తగినట్లు కార్యక్రమాలను మార్పులు చేయాలని పీసీసీ భావిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : May 2, 2022, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.