ETV Bharat / state

BJP అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ: రేవంత్‌రెడ్డి - Revanth Reddy fires on BJP

Revanth Reddy Fires on BJP: బీజేపీపై రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని అని ఎద్దేవా చేశారు. అదానీ ఇంజిన్‌కు రిపేరు వచ్చిందని.. అందుకే ప్రధానికి భయం పట్టుకుందని ఆయన ఆరోపించారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Mar 26, 2023, 7:04 PM IST

Revanth Reddy Fires on BJP: బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటిష్ జనతా పార్టీ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విభజించు- పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని దుయ్యబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను వల్లభ్​బాయ్‌ పటేల్‌ నిషేధించారని అన్నారు. దేశ సంపదను అదానీ సంస్థ కొల్లగొడుతోందని విమర్శించారు. అదానీ పోర్టు నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ గాంధీభవన్​లో నిర్వహించిన సంకల్ప సత్యాగ్రహ దీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అదానీపై మాట్లాడినందుకే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాహుల్‌గాంధీని చూసి నరేంద్ర మోదీ భయపడుతున్నారని విమర్శించారు. డొల్ల కంపెనీలలో అదానీ పెట్టుబడులు పెట్టారని తెలిపారు. పెట్టుబడులపై ఈడీ విచారణ కోరినందుకే రాహుల్‌ను అడ్డుకున్నారని అన్నారు. బీజేపీ నేతలు చాలామందిపై తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నాయని వివరించారు.

డబుల్‌ ఇంజిన్‌ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని: బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై అనర్హత వేటు ఎందుకు వేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని అని ఎద్దేవా చేశారు. అదానీ ఇంజిన్‌కు రిపేరు వచ్చిందని.. అందుకే ప్రధానికి భయం పట్టుకుందని ధ్వజమెత్తారు. భగత్‌సింగ్ వారసుడిగా రాహుల్ ఎవరికీ తల వంచరని.. క్షమాపణలు చెప్పరని వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందని వెల్లడించారు.

''బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటిష్ జనతా పార్టీ. విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంబిస్తోంది. దేశ సంపదను ఆదానీ సంస్థ కొల్లగొడుతొంది. అదానీపై మాట్లాడినందుకే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారు. రాహుల్‌గాంధీని చూసి నరేంద్ర మోదీ భయపడుతున్నారు. డొల్ల కంపెనీలలో అదానీ పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులపై ఈడీ విచారణ కోరినందుకే రాహుల్‌ను అడ్డుకున్నారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని.''- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

దేశం తిరిగి బానిసత్వం వైపు వెళ్తోంది: రాహుల్‌గాంధీకి పైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు 30 రోజుల గడువు ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. కోర్టు గడువు లేకపోతే రాహుల్‌గాంధీని ఎప్పుడో అరెస్ట్‌ చేసేవారని అన్నారు. ఇప్పటికీ గాంధీ కుటుంబానికి సొంత ఇల్లు లేదని వివరించారు. దేశం తిరిగి బానిసత్వం వైపు వెళ్తోందని అన్నారు. బానిసత్వం వైపు వెళ్లకుండా దేశాన్ని యువత కాపాడాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

అంతకుముందు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ ముక్తకంఠంతో ఖండించింది. బీజేపీ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కుట్రపూరితంగా కేంద్రం ఈ చర్యకు పాల్పడిందని హస్తం నేతలు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మోదీ సర్కార్‌పై పోరాటం సాగిస్తామని వారు నినదించారు.

ఇవీ చదవండి: 'ఎన్ని అడ్డంకులు సృష్టించినా మోదీ సర్కార్‌పై పోరాటం సాగిస్తాం'

'అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్​ పునరుద్ధరణ'.. కాంగ్రెస్​​ హామీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.