ETV Bharat / state

కాంగ్రెస్​ నిబద్ధత కేటీఆర్​కు తెలియకపోవడం బాధాకరం: రేవంత్​ రెడ్డి

author img

By

Published : Mar 30, 2022, 2:33 PM IST

Updated : Mar 30, 2022, 2:53 PM IST

Revanth Comments on KTR: రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాల ఏర్పాటుకు తెరాస ప్రభుత్వం నిరాకరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ ఆరోపించారు. రూ.10వేల కోట్లతో ధాన్యం మొత్తం సేకరించడం సమస్యేమీ కాదన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్​.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్​ నిబద్ధత.. మంత్రి కేటీఆర్​కు తెలియకపోవడం బాధాకరమని​ ఆక్షేపించారు.

Revanth Comments on KTR
కేటీఆర్​పై రేవంత్​ ఫైర్​

Revanth Comments on KTR: రైతు సమస్యను రాజకీయం చేయడంలో సీఎం కేసీఆర్​ తీరిక లేకుండా ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్​పై రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతు పట్ల కాంగ్రెస్‌ నిబద్ధత కేటీఆర్​కు తెలియకపోవడం బాధాకరమన్నారు. హరిత విప్లవం, వ్యవసాయ భూమి సీలింగ్ చట్టం, కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల చట్టం, ఉపాధి హామీ, సమగ్ర పంటల బీమా, ఆహార భద్రత.. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎవరి ఘనతని రేవంత్‌ ప్రశ్నించారు.

  • Let me remind that we brought
    -Green revolution
    -Agriculture ceiling act
    -Assignment lands to landless poor
    -MSP
    -Essential Commodities Act
    -PDS
    -Farm loan waiver of 70k+ crore
    -MGNREGA
    -Comprehensive Crop Insurance
    -Food Security

    to uplift the farmers of the country.

    (2/4)

    — Revanth Reddy (@revanth_anumula) March 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Don't worry @KTRTRS we also brought RTE & RTI so that the people of our country can hold governments like yours accountable at all times.

    (4/4)

70 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని రేవంత్​ అన్నారు. ఇక్రిశాట్‌ వంటి సంస్థల ఏర్పాటు, 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చామని గుర్తుచేశారు. భూసేకరణ చట్టం 2013 చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా అని ప్రశ్నించిన రేవంత్‌.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయకుండా మహబూబ్‌నగర్‌ ప్రజలను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. అనంతరం దిల్లీలో రేవంత్​ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్​ నిబద్ధత కేటీఆర్​కు తెలియకపోవడం బాధాకరం: రేవంత్​ రెడ్డి

"దేశంలో రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నాణ్యమైన విత్తనాలను ఇక్రిశాట్‌ వంటి సంస్థలను భారత్‌కు పరిచయం చేసింది కాంగ్రెస్‌ పార్టీ. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చింది. రూ.1,259 కోట్ల విద్యుత్‌ బకాయిలు మాఫీ చేసింది. రైతు కష్టాలు తీరకపోవడంతో యూపీఏ ప్రభుత్వం రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఆరోగ్యశ్రీ, నరేగా, ఆహారభద్రతా చట్టం తెచ్చింది. భూసేకరణ చట్టం 2013 చట్టాన్ని తెచ్చింది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసింది." -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు కూడా కాంగ్రెస్‌ ప్రోత్సాహకాలు ఇచ్చిందని రేవంత్​ గుర్తుచేశారు. 36 లక్షల మంది రైతులకు రూ.5 వేల చొప్పున సాయం చేసిందన్నారు. అనేక ప్రాజెక్టులు చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయకుండా మహబూబ్‌నగర్‌ ప్రజలను తెరాస అరిగోస పెడుతోందని విమర్శించారు. ఐకేపీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరిస్తోందని.. రూ. పదివేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడం పెద్ద సమస్యేమీ కాదని రేవంత్​ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: Boiled Rice Issue : 'బాయిల్డ్ రైస్ కొనేదే లేదు'.. తేల్చి చెప్పిన కేంద్రం

Last Updated : Mar 30, 2022, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.