Revanth Reddy Fire on BRS Leaders : వరి వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో 150 ఎకరాల్లో వరి వేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్కడ పండిన వడ్లను క్వింటాల్‌కు రూ.4,250 చొప్పున అమ్ముకున్నారని తెలిపారు. ఈ విషయంలో విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో రేవంత్ రెడ్డి(REVANTH REDDY), గత ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్(ktr), ఎలాంటి విచారణ అయిన జరిపించుకోండి అని బదులిచ్చారు.
Revanth Reddy Speech in Assembly 2023 : రైతు పంటలకు రైతు జీవితానికి బీమా, ధీమా ఉండాలి రేవంత్ రెడ్డి అన్నారు. అన్నదాత బతికి ఉన్నప్పుడు పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS) చనిపోయాక రూ.5 లక్షలు ఇచ్చిందని ధ్వజమెత్తారు. కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే పంపుసెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. 2014లో పంపుసెట్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జలాలు ఎందుకు వినియోగించుకోలేక పోయామని బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన తరవాత కూడా పాలమూరు, చేవెళ్ల ప్రాంతంపై వివక్ష కొనసాగిందని అన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం అందలేదని మండిపడ్డారు.
ఇప్పుడైనా ఇతరులకు అవకాశం ఇస్తారనుకుంటే మళ్లీ వారే మాట్లాడుతున్నారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy on Electricity Rank : విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అనేది పచ్చి అబద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ తలసరి వినియోగంలో పదో స్థానంలో ఉందని కేంద్రం చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రం కంటే ముందున్న రాష్ట్రాల జాబితాను బీఆర్ఎస్ నాయకులకు తెలియజేశారు.
"బీఆర్ఎస్ వాళ్లు ఏం చేశారో కఠోర నిజాలు వినిపించడమే వారికి అసలైన శిక్ష. వేలాది లారీలతో కేసీఆర్ కుటుంబం ఇసుక దోపిడీకి పాల్పడింది. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలపై కేసులు పెట్టి హింసించారు. దళితులను లాకప్‌లలో పెట్టి కరెంట్ షాక్ ఇచ్చి బాధపెట్టారు. మేనేజ్‌మెంట్ కోటాలో పదవి పొందాలనుకుంటే కేటీఆర్‌కు నిరాశ ఎదురైంది. పదవి దక్కలేదనే నిరాశలో కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రశ్నపత్రాలు లీక్ చేసి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారు. టీఎస్‌పీఎస్‌సీ బోర్డును రద్దు చేసి, దోషులకు శిక్షలు వేసి మళ్లీ పరీక్షలు ఎందుకు నిర్వహించలేదు. ప్రశ్నపత్రాలు అమ్ముకున్నవారు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే."- రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
CM Revanth Reddy on Drugs Mafia in Hyderabad : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ ఘటనపై సిట్ వేయాలని తాను పోరాటం చేశానని తెలిపారు. డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే మన రాష్ట్రాన్ని తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఈ ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికతో వెళ్తోందని తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్, గంజాయి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ వెనుక ఎంత పెద్దవాళ్లున్నా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. గత ప్రభుత్వం నామమాత్రంగా టీఎస్ న్యాబ్ ఏర్పాటు చేశారని అన్నారు. అది కాగితాలకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు.
నాయకుల మధ్య మాటల యుద్ధం - హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు
రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు : కేటీఆర్
మహేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రులు - 'కాంగ్రెస్ హామీలు నెరవేర్చేందుకు 100 రోజుల సమయం ఇస్తున్నాం'