మహిళలు, యువతలో సామాజిక చైతన్యం కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు... రిటైర్డ్ గెజిటెడ్ అధికారి సుభద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులైన ఓటర్లు మంచి వ్యక్తులను, సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకోవాలని కోరారు. తాను గతంలో తెరాస, లోక్ సత్తా పార్టీలతో కలిసి పని చేశానని... ప్రజలకు సేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని సుభద్రారెడ్డి ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం తాను పోరాడతానని చెప్పారు. ముఖ్యంగా మహిళా సమస్యలపై పోరాడతానని హామీ ఇచ్చారు. తెలంగాణలో సినిమా స్టూడియోలు నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. సినీపరిశ్రమలో తెలంగాణ సినీ కార్మికులకు ఎంతో అన్యాయం జరుగుతుందని.. వారి తరపున గళమెత్తుతామని అన్నారు. పట్టభద్రులైన ఓటర్లు తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: గంగులపై నమోదైన ఎన్నికల నియమావళి కేసు కొట్టివేత