అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మిగిలిన కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలోని బాలికలపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి చూసి స్పందించారు మాతృ అభయ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు. ప్రభుత్వం అనుమతించి... చిన్నారులు కోరుకుంటే... వారి పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన... ముందుకొచ్చిన దాతలు హైదరాబాద్లోని మాతృ అభయ సంస్థ ప్రతినిధి, ఉస్మానియ రీసెర్చ్ స్కాలర్ సాయిరె తిరుపతి బాలికలను కలుసుకున్నారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బాలికలకు మాతృ అభయ స్వచ్చంద సంస్థ సేవల గురించి వివరించారు. వారు ఒప్పుకుంటే వారి పూర్తి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే బాలికలు వారి కాళ్లపై వాళ్లు నిలబడేంత వరకు ఆశ్రయం కల్పించడం, విద్య, వైద్యంతోపాటు పూర్తి బాధ్యత తీసుకునేందుకు మాతృ అభయ ఫౌండేషన్ సిద్ధంగా ఉందని సాయిరె తిరుపతి తెలిపారు.
ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి