ETV Bharat / state

కొనసాగుతున్న అవిశ్వాసాల పరంపర.. నేతల అసమ్మతి పర్వాలు

రాష్ర్ట పురపాలికల్లో అవిశ్వాసాల పరంపర కొనసాగుతోంది. 4 సం. అసమ్మతి పర్వాలు తర్వాత బయటికి పొక్కుతున్నాయి. ఆలేరు మున్సిపల్ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. సొంత పార్టీ సభ్యులతో సహా 10 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.

Resolution of no confidence in Telangana state municipalities
కొనసాగుతున్న అవిశ్వాసాల పరంపర.. నేతల అసమ్మతి పర్వాలు
author img

By

Published : Jan 31, 2023, 9:31 PM IST

రాష్ట్ర పురపాలికల్లో అవిశ్వాసాల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వ తీర్మానం ప్రకారం నిర్ణీత గడువు వరకు అధికారంలో ఉన్న ఛైర్మన్ల తొలగింపుకు అవకాశం లేకపోవడంతోనే.. ఇన్ని రోజులు కౌన్సిలర్లు గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసమ్మతి పర్వాన్ని బయటపెట్టడంతో పాటు ప్రభుత్వంలోని లొసుగులను ఎత్తిచూపిస్తున్నారు సభ్యులు.... ఏదేమైనప్పటికీ అవిశ్వాసాల పర్వం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందని నేతలు తలలు పట్టుకుంటుంన్నారని చెప్పుకోవచ్చు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ వస్పరి శంకరయ్యకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. మున్సిపాలిటీలో భారాసకు 8మంది, కాంగ్రెస్ కు - 1, భాజపాకు 1, స్వతంత్రులుగా ఇద్దరు కౌన్సిలర్లున్నారు. సొంత పార్టీ సభ్యులతో సహా 10 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం ఇచ్చారు. కౌన్సిలర్లను ఛైర్మన్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆలేరు నియోజకవర్గంలోనే రెండు మున్సిపాలిటీల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం తలెత్తిన పరిణామాలు... ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు తలనొప్పిగా మారాయి.

జనగామ మున్సిపల్ అవిశ్వాస రాజకీయాలు హనుమకొండకు చేరుకున్నాయి. భారాసకు చెందిన అసమ్మతి కౌన్సిలర్లు 3రోజుల క్రితం క్యాంపులకు వెళ్లగా.. ఇవాళ హనుమకొండలోని హరిత హోటల్ కు చేరుకున్నారు. జనగామకు చెందిన భారాస నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలోనూ అవిశ్వాసాల పర్వం తెరమీదకొచ్చింది. కొందరు కౌన్సిలర్లు తనపై ఆరోపణలు చేస్తూ అవిశ్వాసం పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ శాసనసభ బిల్లు పెండింగ్‌, కోర్టు స్టే ఆర్డర్‌ వల్ల 3వారాల పాటు ఉపశమనం లభించిందని ఛైర్మన్‌ తెలిపారు. తాను ఎప్పుడూ విమర్శలను పట్టించుకోనని ప్రజా సమస్యలు, మున్సిపల్ అభివృద్ధి కోసం అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఛైర్మన్‌ స్పష్టం చేశారు.

కొన్ని చోట్ల ఛైర్ పర్సన్ , వైస్ ఛైర్ పర్సన్‌లను తొలగించే వరకూ పట్టువీడేదేలే అంటున్నారు పుర సభ్యులు.... ప్రస్తుతం రాష్ర్టంలో జరుగుతున్న చర్చలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు.

కొనసాగుతున్న అవిశ్వాసాల పరంపర.. నేతల అసమ్మతి పర్వాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.