ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం(chittor district kuppam)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైకాపా జనాగ్రహ దీక్షలో రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్(RESCO senthil kumar).. తెదేపా అధినేత చంద్రబాబు(tdp chief chandrababu) సహా పలువురు పార్టీ నేతలను అసభ్య పదజాలంతో దూషించటం స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు చంద్రబాబు వాహనంపై బాంబు వేస్తానని బెదిరింపులకు పాల్పడటం విమర్శలకు దారి తీసింది.
వైకాపా నేతల వ్యాఖ్యలపై తెదేపా శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు తెదేపా నాయకులు సిద్ధమయ్యారు. అయితే.. స్టేషన్కు వెళ్తున్న తెదేపా నాయకులను.. వైకాపా నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వైకాపా నేతలను పోలీసులు వెనక్కి పంపుతుండగా.. ఇద్దరు నాయకులు అర్బన్ సీఐని తోసేశారు. ఓవైపు అధికార పార్టీ.. మరో వైపు తెదేపా శ్రేణుల అరుపులతో కుప్పంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి: PATTABHI BAIL: ఏపీ హైకోర్టులో పట్టాభి బెయిల్ పిటిషన్ దాఖలు