కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నిత్యం ప్రజల మధ్య ఉండే రైల్వే ఉద్యోగులకు కొవిడ్ టీకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ను హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో అధికారులు కలిశారు. రైల్వే ఉద్యోగులకు కోవిడ్ టీకాల కేటాయింపు కోసం చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ను కోరారు.
సికింద్రాబాద్ సహా కాజీపేట, వికారాబాద్ల్లో వైద్యపరంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. వారి విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. సమావేశంలో డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా, సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర శర్మ కలిశారు.
ఇదీ చదవండి: కొవిడ్ చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి: సీతక్క