హైదరాబాద్ నగర వాసుల్లో నీటి ఆవశ్యకతను తెలిపేందుకు జలమండలి ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ థీమ్ పార్కును అమెరికాకు చెందిన సేవ్ వాటర్ నెట్వర్క్ దిల్లీ ప్రతినిధులు సందర్శించారు. జలమండలి ఎండీ దానకిషోర్ను కలిశారు. నీటి విలువను తెలిపేందుకు ఈ పార్కు ఎంతో దోహదం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి చేపడుతున్న వాక్ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. ప్రతినిధులలో సేవ్ వాటర్ నెట్ వర్క్ ప్రధాన కార్యాలయ ప్రతినిధి టామ్ క్రెస్, దిల్లీ ప్రతినిధులు చారులాల్, ఆనంద్ రుద్ర, రవి సేవక్, పూనం సేవక్, వేణు రాచూర్, శంకర్ బట్రా తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి : 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'