నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ల కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారని అధికారులు తెలిపారు. ఆదివారం మినహా మిగిలిన పని దినాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 20న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయిస్తారు.
లైసెన్సుదారులు తొలి విడత వాయిదా చెల్లింపునకు 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటైన దుకాణాలకు ఈ నెల 29న మద్యం సరఫరా చేస్తారు. డిసెంబరు 1 నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 2,216 దుకాణాలకు అదనంగా 404 ఏర్పాటవుతున్నాయి. ఫలితంగా ఈ దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెరగనున్నాయి.
ఇదీ చూడండి: Liquor Sales: మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు.. 350కిపైగా పెరిగే అవకాశం!