ETV Bharat / state

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల - telangana varthalu

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
release-of-intermediate-exam-schedule
author img

By

Published : Jan 28, 2021, 5:02 PM IST

Updated : Jan 28, 2021, 7:46 PM IST

16:59 January 28

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

   ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 1 నుంచి జరగనున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూలును విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మే 1 నుంచి 19వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం.. మే 2 నుంచి మే 20 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు ఉంటాయి. ఒకేషనల్ కోర్సులకూ ఇదే షెడ్యూలు వర్తిస్తుందని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.  

   ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు కార్యదర్శి పేర్కొన్నారు. మానవ విలువల పరీక్ష ఏప్రిల్ 1న, పర్యావరణ పరీక్ష ఏప్రిల్ 3న ఉంటాయన్నారు. డెబ్బై శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రశ్నపత్రంలో మరిన్ని ఛాయిస్​లు ఉండనున్నాయి. ప్రశ్నపత్రం, సిలబస్ వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.

వివరాలు ఇలా.. 

క్ర.సం                            పరీక్షలు                                        తేదీలు
    1.                            ఇంటర్​ మెుదటి సంవత్సరం              మే 1 నుంచి 19వరకు 
    2.                      ఇంటర్​ ద్వితీయ సంవత్సరం      మే 2 నుంచి మే 20 వరకు 
    3.ప్రాక్టికల్స్​                             ఏప్రిల్ 7 నుంచి 20 వరకు   
    4.మానవ విలువల పరీక్ష                 ఏప్రిల్ 1న  
    5.పర్యావరణ పరీక్ష                       ఏప్రిల్​ 3న   

ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భృతి: కేటీఆర్

Last Updated : Jan 28, 2021, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.