ETV Bharat / state

రెయిన్​బో ఆస్పత్రి సిబ్బందిపై దాడి దృశ్యాల విడుదల - rainbow

ఆస్పత్రి సిబ్బందిపై ఓ పేషంట్​ బంధువులు దాడి చేసిన ఘటన హైదరాబాద్​ రెయిన్​బో ఆస్పత్రిలో జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్​ దృశ్యాలను ఆస్పత్రి వర్గాలు విడుదల చేశాయి.

దాడి చేస్తున్న దృశ్యం
author img

By

Published : Aug 17, 2019, 7:53 PM IST

హైదారాబాద్​ రెయిన్​బో పిల్లల ఆస్పత్రిలో సిబ్బందిపై ఓ పేషంట్​ తరఫు బంధువులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న జరిగిన ఈ దాడికి సంబంధించి.. పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్​ చేశారు. డెంగ్యూ జ్వరంతో ఈ నెల మొదటి వారంలో ఆస్పత్రికి చేరిన ఏడేళ్ల చిన్నారికి వైద్యులు చికిత్స చేసి కాపాడారు. దాదాపు గత పది రోజులుగా చిన్నారి ఆస్పత్రిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో బాలికను చూసేందుకు రాత్రి పూట ఆస్పత్రికి వచ్చిన బంధువులు ఆస్పత్రి లిఫ్ట్​లో మొదట తమను పంపించాలని డిమాండ్ చేశారు.

బెదిరింపులు

ఐసీయూకి అత్యవసరంగా పంపాల్సిన మందులు ట్రాలీలో ఉన్నాయని... అందువల్ల ముందుగా ట్రాలీని పంపుతున్నట్లు వివరణ ఇచ్చినా... వినకుండా విధుల్లో ఉన్న అధికారులపై దాడి చేశారు. అడ్డుకోబోయిన వారిని బెదిరింపులకు గురిచేసినట్టు ఆస్పత్రి ఓ ప్రకటనతో పాటు సంబంధిత ఫుటేజ్​ను విడుదల చేసింది.

రెయిన్​బో ఆస్పత్రి సిబ్బందిపై దాడి దృశ్యాల విడుదల

ఇదీ చూడండి: కశ్మీర్​: ఐదు జిల్లాల్లో అంతర్జాల సేవల పునరుద్ధరణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.