ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలిక సంఘం పరిధిలో ఓ వ్యక్తి జ్వరంతో మృతి చెందాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలింది.
ఆస్పత్రికి తీసుకొచ్చి... చనిపోయే వరకు ఉన్న మృతుడి బంధువులు... కరోనా అని తెలియటంతో కనిపించకుండా వెళ్లిపోయారు. చివరకు పురపాలక శాఖ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు తమ సిబ్బందితో అంత్యక్రియలు చేశారు.