ETV Bharat / state

డీజే సౌండ్ పెంచమంటే... రాళ్లతో కొట్టించాడు - GODAVA

అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అనంతరం వివాహ విందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంతో ఖర్చు చేసి డీజే కూడా పెట్టించారు. బాగా చిందులేయొచ్చు అనుకున్న బంధువులంతా... ఒళ్లంతా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇంతకూ అసలేం జరిగింది? వివాహ విందుకెళ్లిన వారికి దెబ్బలు ఎలా తగిలాయి?

డీజే సౌండ్ పెంచమంటే... రాళ్లతో కొట్టించాడు
author img

By

Published : Jun 1, 2019, 1:35 PM IST

డీజే సౌండ్ పెంచమంటే... రాళ్లతో కొట్టించాడు

గత నెల 29న నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లిలో శాంతకుమార్, నందినిల వివాహం కన్నుల పండువగా జరిగింది. 30న వివాహ విందు కోసం వరుడి స్వగృహమైన హైదరాబాద్ దుండిగల్ పీఎస్ పరిధిలోని న్యూ శివాలయం కాలనీకి వచ్చారు. ఈ కార్యక్రమానికి డీజే ఏర్పాటు చేశారు. అందరూ తిని ఇక ఆనందంగా చిందులేస్తూ గడపొచ్చు అనుకున్నారు. డీజే పెట్టి ఒక్కొక్కరుగా డ్యాన్సులు వేస్తున్నారు. రాత్రి 12 గంటలకు డీజే చప్పుడు సరిపోలేదు ఇంకా పెంచాలని అమ్మాయి తరఫు బంధువులు అడిగారు. ససేమిరా పెంచడం కుదరదని నిర్వాహకుడు గట్టిగా చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. బంధువులంతా కలిసి తనని తిడుతున్నారని కోపంతో డీజే నిర్వాహకుడు సూరారం గ్రామానికి చెందిన తన బంధువులు 25 మందిని పిలిపించుకున్నాడు. వారు కట్టెలు, హాకీ స్టిక్స్​, కారం పొడి, రాళ్లతో వచ్చి చుట్టాలందరిపై దాడి చేసి పారిపోయారు.

ఈ దాడిలో పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు నలుగురితోపాటు 17 మంది బంధువులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో వారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: అమ్మో కూర 'గాయం' చేస్తోంది!

Intro:Hyd_tg_13_01_Reception dhadi_avb_c29 మేడ్చల్ : జీడిమెట్ల డిజె సౌండ్ విషయంలో ఘర్షణ నోట్ : దాడి చేసిన విజువల్స్ పంపడం జరిగింది

Body:సౌండ్ పెంచు అన్నందుకు ఆగ్రహించిన డిజె చెట్టు ఓనర్ తన అనుచరులతో పెళ్లి రిసెప్షన్ కు వచ్చిన వారిపై దాడి చేసిన సంఘటన పీఎస్ పరిధిలో జరిగింది. శాంతం కుమార్ నందిని ల వివాహం గత నెల 29న నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కమ్మర్ పల్లి గ్రామంలో జరగగా, పెళ్లి రిసెప్షన్ నగరంలోని నగరంలోని దుండిగల్ పిఎస్ పరిధి లోని సూరారం న్యూ శివాలయం నగర్ లోని పెళ్ళికొడుకు స్వగృహంలో 30 మే నెల జరిగింది. ఈ ఫంక్షన్కు డీజే ఏర్పాటు చేయడంతో వచ్చిన బంధువులు రాత్రి 12 గంటల సమయంలో డిజె సౌండ్ పెంచమని కోరడం తో నిర్వాహకుడికి బంధువుల మధ్య గొడవ జరిగింది. వీరి మధ్య మాటా మాటా పెరిగి కోపోద్రిక్తుడైన డీజే నిర్వాహకుడు సూరారం గ్రామానికి చెందిన తన వారిని దాదాపు 25 మంది ని పిలిపించి కట్టెలు హాకీ స్టిక్ కారంపొడి రాళ్లతో వెళ్లి వారిపై దాడి చేయించి పరారయ్యారు. ఈ దాడిలో సుమారు 21 మంది కి గాయాలయ్యాయి. పెళ్ళికొడుకు ఇంట్లోని వారికి నలుగురికి బంధువులు 17 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లరి మూకలు పరారీలో ఉన్నారని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Conclusion:బైట్ : గాయపడ్డ బంధువులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.