ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ వల్ల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులపై స్థిరాస్తి వ్యాపారులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ను కలిశారు. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. నూతన విధానంలో ఇబ్బందుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు.
కొత్త విధానంపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్‌కు సిద్ధంగా ఫ్లాట్లను పాత విధానంలోనే పూర్తి చేసేలా మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పా సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, సభ్యులు సత్య శ్రీరంగం, స్థిరాస్తి వ్యాపారులు పాల్గొన్నారు.