ETV Bharat / state

గురుకుల పాఠశాల వసతి గృహంలో ఎలుకలు.. విద్యార్థులకు తిప్పలు!

Rats are biting students: మనం సహజంగా పాముకాటు, కుక్కకాటు బాధితుల్ని నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఎలుక కాటు బాధితుల్ని ఎప్పుడైనా చూశామా..? ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని సేవాగఢ్​లో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహంలో విద్యార్థులు ఎలుక కాటుకు గురవుతున్నారు. మనిషిని చూసి పారిపోయే ఈ చిన్ని ఎలుకలు వసతి గృహంలో విద్యార్థులకు పెద్ద తిప్పల తెచ్చిపెట్టి రాత్రుళ్లు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

Rats are biting students
Rats are biting students
author img

By

Published : Nov 30, 2022, 1:43 PM IST

గురుకుల పాఠశాల వసతి గృహంలో ఎలుకలు.. విద్యార్థులకు తిప్పలు..!

Rats are biting students: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని సేవాగఢ్‌లో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎలుక కాటుకు గురవుతున్నారు. గాయపడిన 8 మంది.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. విడతల వారీగా టీకాలు వేయించుకుంటున్నారు. హాస్టల్లో బోధనేతర సిబ్బంది తక్కువగా ఉండటంతో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు.

గదులు కూడా శుభ్రం చేయటం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఎలుకలు పెరిగి నిత్యం వాటితో ఇబ్బందులు పడుతున్నామని, అవి కరుస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులకు సరైన వసతి సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే కొంతమంది ఉద్యోగుల అలసత్వం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అయినా ఎప్పుడో ఒకసారి కాకుండా రోజు ఎలకల కొరకడం ఏంటి అని ఈ వార్త విన్నవారందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.