ETV Bharat / state

అలర్ట్​ - రేషన్​ కార్డుల KYC లాస్ట్​డేట్​ వచ్చేసింది! - KYC Registration Process

Ration Card KYC Last Date in TS: రాష్ట్ర ప్రజలకు అలర్ట్​. రేషన్​ కార్డు కేవైసీకి సంబంధించిన ఆఖరి తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరులోగా అందరూ కేవైసీ పూర్తి చేయాలని తెలిపింది.

Ration Card KYC Last Date in TS
Ration Card KYC Last Date in TS
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 12:15 PM IST

Ration Card KYC Last Date: రాష్ట్రంలో రేషన్​ కార్డు లబ్ధిదారులు.. కేవైసీ పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. బోగస్ రేషన్​ కార్డుల ఏరివేతతోపాటు.. రేషన్ సరకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2014 నుంచి రేషన్ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. రేషన్‌ కార్డుల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో.. వారందరికీ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ.. వాస్తవంగా చూసుకుంటే.. గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ఎంతోమంది చనిపోగా... చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. మరికొంతమంది.. పెళ్లి తర్వాత కొత్త కాపురాలు పెట్టారు. దీంతో.. ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టకుండా నిజమైన లబ్ధిదారులకే అందాలనే ఆలోచనతో 'కేవైసీ' పేరిట రేషన్ కార్డుల వెరిఫికేషన్​కు శ్రీకారం చుట్టింది.

గుడ్ న్యూస్‌ - కొత్త రేషన్ కార్డుల కోసం 28 నుంచి దరఖాస్తులు!

KYC Last Date: అయితే ఇప్పటి వరకు రేషన్‌కార్డు కలిగిన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రేషన్‌ షాపుకు వచ్చి వేలిముద్ర వేసి బియ్యం తీసుకునేవారు. అయితే తెలంగాణ గత ప్రభుత్వం.. రేషన్‌ కార్డు(Ration Card) కలిగిన ప్రతి కుటుంబంలో ఎవరెవరున్నారనే విషయం తెలుసుకునేందుకు.. ఒకసారి కుటుంబ సభ్యులంతా రేషన్‌ దుకాణానికి వచ్చి 'నో యువర్‌ కస్టమర్‌'(కేవైసీ) పేరిట వేలి ముద్రలు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా.. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా దీనికి తుది గడువును అధికారులు విధించారు. జనవరి 31వ తేదీలోగా లబ్ధిదారులు కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు.

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్​న్యూస్ - మరో ఐదు సంవత్సరాల పాటు ఆ స్కీమ్​ను పొడిగించిన కేంద్రం!

కేవైసీ ఎలా చేసుకోవాలంటే..:

KYC Registration Process in Telugu

  • రేషన్‌కార్డులో పేరు ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీప చౌకధరల దుకాణానికి వెళ్లి 'ఈ-పాస్‌' యంత్రంలో మరోసారి వేలిముద్రలు వేయాలి.
  • అక్కడ మీరు వేలి ముద్ర వేయగానే రేషన్‌కార్డు నెంబరుతో పాటు కార్డు సభ్యుల ఆధార్‌కార్డు నెంబరు చూపిస్తుంది.
  • వీటిని సరి చూసిన తరువాత ఆ మిషన్​లో ఆకుపచ్చ రంగు వెలిగి సదరు సభ్యుల కేవైసీ పునరుద్ధరణ జరుగుతుంది.
  • ఒకవేళ రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే.. వినియోగదారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు సరిపోలడం లేదని అర్థం. దీంతో రేషన్‌ కార్డ్‌ నుంచి ఒక యూనిట్‌ను తొలగిస్తారు.
  • రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నాయో, వారంతా ఒకే సమయంలో కేవైసీ కోసం రేషన్ దుకాణానికి వెళ్లాలి.

Telangana Ration Card Holders Must Complete KYC Registration: అలా చేయకపోతే.. మీకు రేషన్ కార్డు రద్దయిపోతుంది!

ఇప్పటివరకు ఎంత: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అత్యధికంగా 87.81% నమోదుతో ప్రథమ స్థానంలో ఉండగా.. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 54.17% పూర్తయిందని అధికారులు వెల్లడించారు. కాబట్టి ఇప్పటికీ కేవైసీ చేయించని వారు త్వర పడి.. రేషన్​ కట్​ కాకుండా చూసుకోండి.!

How to Apply for One Nation One Ration Card : ఈ కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా రేషన్ పొందవచ్చు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!

How to Apply New Ration Card 2023 in Telangana : మీకు 'రేషన్​కార్డు' లేదా..? మీ మొబైల్​ నుంచే అప్లై చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.