రథ సప్తమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సూర్య నమస్కారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రామాలయం పక్కనే కల్యాణ వేదిక వద్ద.. వైదిక బృందం ఆధ్వర్యంలో వైభవంగా పూజలు చేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమాన్ని కన్నులపండువగా చేశారు. ఈవో త్రినాథరావు.. క్షేత్ర రక్షకులుగా కొలిచే అమ్మవారికి చేసే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో చూపరులను కట్టిపడేసే శిల్ప సౌందర్యం