ETV Bharat / state

Rashtrapati Nilayam in Hyderabad : రాష్ట్రపతి నిలయానికి తరలివస్తున్న సందర్శకులు - Rashtrapati Bhavan in Hyderabad Visiting Hours

Rashtrapati Bhavan in Hyderabad : బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు.. ప్రజలు తరలివస్తున్నారు. మార్చి 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభించిన.. టన్నెల్‌ కిచెన్‌, నాలెడ్జ్‌ గ్యాలరీ సహా పలు గార్డెన్‌లు సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. రాష్ట్రపతి నిలయం సందర్శనను ఏడాదిపాటు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన అనంతరం.. కేవలం 10 వేల మంది మాత్రమే వచ్చారని.. భవిష్యత్తులో ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 16, 2023, 11:22 AM IST

సందర్శనకి అందుబాటులో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం

Rashtrapati Bhavan in Hyderabad Visiting Hours : సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శనకు గతంలో ప్రజలకు 15 రోజుల పాటు అనుమతించేవారు. పునరుద్ధరించిన టన్నెల్‌ కిచెన్‌, నాలెడ్జ్ గ్యాలరీ సహా పలు గార్డెన్లను మార్చి 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే వర్చువల్‌గా ప్రారంభించారు. అప్పట్నుంచి పిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు తరలివస్తున్నారు. పచ్చని చెట్లు, చల్లని వాతావరణం మధ్య ఆహ్లాదకరంగా సందర్శన సాగుతోందని రాష్ట్రపతి నిలయం మేనేజర్‌ రజినీప్రియ తెలిపారు.

Rashtrapati Bhavan in Bollaram ticket Price : రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన చారిత్రక సమాచారం అంతా ఒక దగ్గర ఏర్పాటు చేసిన నాలెడ్జ్‌ గ్యాలరీని ప్రతి ఒక్కరూ తిలకించి.. ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలన్నారు. పునరుద్ధరించిన టన్నెల్‌ కిచెన్‌, నాలెడ్జ్ గ్యాలరీ, రాక్‌.. బటర్‌ఫ్లై, నక్షత్ర, హెర్బల్‌ గార్డెన్లు.. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. నిజాం కాలంలో నిర్మించిన టన్నెల్‌ కిచెన్‌ను పూర్తిగా పునరుద్ధరించి.. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడే బొమ్మలతో టన్నెల్‌ గోడలను అలంకరించారు. వీటితో పాటు మంచి నీటి సరఫరా కోసం మెట్ల బావిని కూడా ఏర్పాటు చేశారు.

Bollaram Rashtrapati Bhavan History : 1850లో నిజాం నజీర్ ఉద్దౌలా పాలనలో రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. తర్వాత కొన్నాళ్లు ఈ భవనం నిజాం ప్రభుత్వ ప్రధాన సైనికాధికారి నివాసంగా మారింది. 1948లో హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో చేర్చిన తర్వాత.. సంప్రదాయ ప్రెసిడెంట్ రెసిడెన్సీ హౌస్ రీట్రీట్‌గా మారింది. శీతాకాలంలో రాష్ట్రపతి దాదాపు రెండు వారాల పాటు ఇక్కడే ఉండి.. అధికారిక వ్యవహారాలను నిర్వహిస్తారు. కంటోన్మెంట్‌ జోన్లలో ఒకటి అయిన బొల్లారంలోని ఈ రాష్ట్రపతి భవనాన్ని మెుత్తం అధ్యక్ష, కుటుంబ, ఏడీసీ విభాగాలుగా నిర్మించారు.

"రాష్ట్రపతి భవనాన్ని సందర్శించాలంటే ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ visit.rastrapathibhavan.gov.in లోకి వెళ్లి పొందవచ్చు. దేశీయ సందర్శకునికి రూ.50, విదేశీయులకు రూ.250లు ఉంటుంది. రాష్ట్రపతి నిలయం దగ్గర ఆఫ్‌లైన్‌ టికెట్లు లభిస్తాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉచితంగా సందర్శించవచ్చు. దీనివల్ల వారు పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు." - రజినీప్రియ, రాష్ట్రపతి నిలయం మేనేజర్‌

Rashtrapati Bhavan in Telangana : భవనంలో 150 మంది వరకు సందర్శకులు ఉండేలా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ భవనంలో సినిమా హాల్, స్టేట్ డైనింగ్ హాల్, మార్నింగ్ రూమ్, దర్బార్ హాల్, ఏడీసీ డైనింగ్ రూమ్‌లతో విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన రాష్ట్రపతి నిలయం.. సందర్శకులను ఆకట్టుకుంటోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.