పర్వావరణ సమతుల్యత దెబ్బ తినడం వల్లే కరోనా లాంటి వైరస్ల ఉద్ధృతి కొనసాగుతోందని రంగారెడ్డి జిల్లా సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యద్శి జి.ఉదయ్ కుమార్ అన్నారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ వనస్థలిపురం జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనం-మనం కార్యక్రమంలో ఉదయ్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు.
సచివాలయనగర్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో కమిటీ సభ్యులతో కలిసి మామిడి, బత్తాయి, జామ, నిమ్మ తదితర మొక్కలను నాటారు. జాగృతి అభ్యుదయ సంస్థ ప్రతినిధులను అభినందించిన సీనియర్ సివిల్ జడ్జి... పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి జీవితంలో భాగం కావాలని సూచించారు. కరోనా తగ్గాక ఇంటింటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సచివాలయనగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా