ETV Bharat / state

'రామోజీ ఫిల్మ్‌సిటీ'లో పర్యాటకుల సందడి - రామోజీ ఫిల్మ్​ సిటీ తాజా వార్తలు

పర్యాటకుల కలల లోకం రామోజీ ఫిల్మ్‌సిటీలో మళ్లీ సందడి మొదలైంది. కరోనా కారణంగా విరామం అనంతరం సందర్శకుల కేరింతలతో ఫిల్మ్‌సిటీ మార్మోగుతోంది. ప్రకృతి అందాలు, వింతలు, విశేషాలు, వినోదాలతో ఆబాలగోపాలానికి సరికొత్త అనుభూతిని పంచుతోంది. సందర్శకుల భద్రత కోసం కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ.... ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వహకులు.

ramoji film city started from today
పర్యాటకులతో సందడిగా మారిన 'రామోజీ ఫిల్మ్‌సిటీ '
author img

By

Published : Feb 18, 2021, 8:23 PM IST

Updated : Feb 18, 2021, 9:04 PM IST

'రామోజీ ఫిల్మ్‌సిటీ ' పర్యాటకుల సందడి

ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రనగరిగా గిన్నిస్‌ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన రామోజీ ఫిల్మ్ సిటీలో.. మళ్లీ మధురానుభూతులు మొదలయ్యాయి. కరోనా పరిస్థితుల అనంతరం సకుటుంబ సమేతంగా సెలవు రోజులు ఆనందంగా గడిపేందుకు ఫిల్మ్‌సిటీ అవకాశం కల్పిస్తోంది. కొవిడ్‌ మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి... పర్యాటకులను మైమరిపించే కార్యక్రమాలతో స్వాగతం పలుకుతోంది. సుమారు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అద్భుత పర్యాటక ప్రదేశం.. నిరంతరం చిత్రీకరణలు జరుపుకొనే షూటింగ్ స్పాట్లు, నందనవనాలు, లైవ్ షోలు, ప్లే కోర్టులు, థ్రిల్‌కు గురిచేసే సాహస్ అడ్వెంచర్ ల్యాండ్, బాహుబలి సెట్లు మైమరిచిపోయేలా చేస్తున్నాయి.

తొలిరోజే వేలాది మంది రాక

కరోనా పరిస్థితుల నుంచి దాదాపుగా కోలుకుంటున్న తరుణంలో.. విహారానుభూతిని పొందేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఫిల్మ్‌సిటీ తెరుచుకున్న తొలిరోజే వేలాది మంది తరలొచ్చి.... కేరింతలు కొట్టారు. వింటేజ్ బస్సుల్లో ప్రయాణిస్తూ రోజంతా అద్భుత ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నారు. సినిమా సెట్టింగ్‌లు, సుందరమైన ఉద్యానవనాలు, మనసును ఆహ్లాదపరిచే లొకేషన్లను వీక్షిస్తూ.. మైమర్చిపోతున్నారు. రాజుల కాలాన్ని తలపించే కోటలు, మొగలుల వైభవం, మౌర్యులు శౌర్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాలకు మంత్రముగ్ధులవుతున్నారు.

ఎన్నెన్నో అద్భుతాలు

ఆర్​ఎఫ్​సీలో నిర్వహించే లైవ్ షో.. రంగుల వినోదాన్ని పంచుతుంది. అదిరే కొరియోగ్రఫీతో చేసే లైవ్ డాన్స్‌లు, 'యాక్షన్ ప్యాక్డ్​ వైల్డ్ వెస్ట్ స్టంట్ షో' చూస్తే వారెవా అనాల్సిందే. కళాకారుల ఆన్ స్టేజ్ లైవ్ పెర్ఫామెన్స్‌కు యానిమేషన్ కలిపి చేసే బ్లాక్ లైట్ షో మరో హైలైట్‌గా నిలుస్తోంది. ఫిల్మ్‌సిటీలోని ఎక్స్‌క్లూజివ్‌ ప్లే జోన్లు పిల్లలను విశేషంగా అలరిస్తున్నాయి. భారీ సైజులో ఉండే బోర్డుపై స్నేక్స్ అండ్ లాడర్ గేమ్ ఆడటం సరికొత్త అనుభూతినిస్తుంది. వినోదంతోపాటు కాస్త సాహసాలకు అత్యుత్తమ వేదికైన సాహస్‌.. అన్ని వయసుల వారిని అబ్బురపరుస్తోంది. పచ్చని పందిరి కింద ఉన్న బర్డ్ పార్క్ వివిధ ఖండాలకు చెందిన పక్షులు.. అన్యదేశ జాతులు, రంగులు కలిగిన అద్భుతమైన బటర్ ఫ్లై పార్కును సందర్శించి పర్యాటకులు మైమర్చిపోతున్నారు. కరోనా పరిస్థితుల అనంతరం ఫిల్మ్‌సిటీలో ముందస్తు జాగ్రత్తలు, వినోదాన్ని పంచే కార్యక్రమాలను చూసి.. మర్చిపోలేని అనుభూతి పొందుతున్నట్లు చెబుతున్నారు.

భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి అనుభూతిని ప్రత్యక్షంగా పొందే అవకాశం రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనతో పొందుతున్నారు. మాహిష్మతీ సామ్రాజ్యంలోని సుందర రాజప్రసాదాలు, అద్భుత ఆలయాల మధ్య సరదాగా విహరిస్తున్నారు.

ఇదీ చదవండి: ఇండియా సైకిల్ ఫర్ ఛేంజ్ ఛాలెంజ్​లో రాష్ట్రం నుంచి 2 నగరాలు

Last Updated : Feb 18, 2021, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.