ETV Bharat / state

ఉర్రూతలూగించే ప్రదర్శనలు.. థ్రిల్లింగ్ స్టంట్స్‌..@ రాంబో సర్కస్‌ - రాంబో సర్కస్‌ తాజా వార్తలు

Rambo Circus In Vizag: ఏపీలోని విశాఖ సిరిపురంలో గల గురజాడ కళాక్షేత్రంలో గురువారం ప్రారంభమైన రాంబో సర్కస్ అమితంగా ఆకట్టుకుంటోంది. యువ కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను ఉర్రూతలూగిస్తున్నాయి. థ్రిల్ కలిగించే స్టంట్స్‌తో పాటు జోకర్ల కామెడీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఐదేళ్ల తర్వాత నగరంలో సర్కస్ ఏర్పాటు చేయడంతో కళాకారుల విన్యాసాలు తిలకించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

Rambo Circus In Vizag
Rambo Circus In Vizag
author img

By

Published : Feb 18, 2023, 10:05 AM IST

Rambo Circus In Vishakhapatnam : బెంగుళూరు, ముంబయి నగరాల్లో విజయవంతమైన రాంబో సర్కస్.. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరవాసులను ఆకట్టుకునేందుకు వచ్చేసింది. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో గురువారం ప్రారంభమైన ఈ రాంబో సర్కస్.. నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటోంది. 120 నిమిషాల పాటు ఉత్కంఠభరితమైన విన్యాసాలను ప్రదర్శించే ఈ రాంబో బృందం.. ఆహుతులను ఉర్రూతలూగిస్తోంది. స్కేటింగ్, ల్యాడర్ బ్యాలెన్స్, క్యూబ్ జగ్లింగ్, రోల్లా బొల్లా, హులా హూప్, ఏరియల్ రోప్ వంటి అనేక ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు.

వైజాగ్​లో రాంబో సర్కస్‌

ఒకప్పటి సర్కస్‌ల మాదిరగా జంతువులు, పక్షులు లేనప్పటికీ.. వాటిని మైమరపించేలా ఉన్న కళాకారుల స్టంట్స్‌ ఆకట్టుకుంటున్నాయని ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు తెలిపారు. సెల్‌ఫోన్‌లకు, వీడియో గేమ్‌లకు ప్రాధాన్యమిస్తోన్న ఈ తరం చిన్నారులకు.. ఇలాంటి సర్కస్‌లు ఎంతో ఆటవిడుపునిస్తాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.

Rambo Circus: ఆదివారంతో విశాఖలో ఈ రాంబో సర్కస్ ప్రదర్శన ముగుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కేవలం నాలుగు రోజులు మాత్రమే సిరిపురంలో ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలిపారు. శని, ఆది వారాల్లో రోజుకు 5 షోలు వేస్తున్నామని.. విశాఖ ప్రజలు తరవివచ్చి తమ ప్రదర్శనను తిలకించి ప్రోత్సహించాలని కోరారు.

ఆ మద్దతే మమ్మల్ని నిలబెట్టింది..: కరోనా సమయంలో ఎన్నో సర్కస్‌లు చాలా వరకు మూతపడినా.. రాంబో సర్కస్‌కు ప్రజల తిరుగులేని మద్దతుతో నిలబడగలిగామని నిర్వాహకులు పేర్కొన్నారు. తమపై ప్రజల విశ్వాసమే తాము వారిని చేరుకోవడానికి వినూత్న మార్గాలను అన్వేషించేలా చేసిందని తెలిపారు. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్ సర్కస్ షోలు, జూమ్, టీమ్‌, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రదర్శనలు అందించామని వివరించారు.

''కొవిడ్‌ కాలంలో మా తోటి సర్కస్‌లు ఎన్నో మూతపడ్డాయి. మాకు ప్రజల మద్దతు ఉండటంతో నిలబడగలిగాం. మాపై వారికి ఉన్న ఆసక్తి, విశ్వాసమే మేము కొత్త మార్గాలు వెతుక్కునేలా చేసింది. తొలిసారిగా ఏర్పాటు చేసినా.. విశాఖ ప్రజలు ఆదరిస్తుండటం ఆనందంగా ఉంది. శని, ఆదివారాల్లో 5 షోలు వేస్తున్నాం. ప్రజలు తరలివచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలి.'' - సర్కస్‌ నిర్వాహకుడు సుజిత్‌ దిలీప్

ఇవీ చదవండి..

Himanshu Kalvakuntla : సోషల్ మీడియాలో కేటీఆర్ తనయుడు హిమాన్షు సాంగ్ వైరల్

దేశంలోకి మరిన్ని చీతాలు.. దక్షిణాఫ్రికా నుంచి స్పెషల్ ఫ్లైట్​లో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.