రామజన్మ భూమి ట్రస్ట్ ఓయూ ఇంఛార్జ్ డా.అనంత శంకర్ ఆధ్వర్యంలో తార్నాక మాణికేశ్వరి నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. రామ మందిర నిర్మాణానికి ప్రతీ హిందువూ సహకరించాలని కోరారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరుగుతున్న నిధి సేకరణ, జనజాగరణ ఉద్యమంలో భాగంగా ర్యాలీ చేపట్టారు.
త్యాగానికి, హిందూ సంస్కృతికి చిహ్నం గల రామ మందిరం నిర్మాణం కోసం జరిగిన పోరాటాన్ని వివరించామని డా.అనంత శంకర్ తెలిపారు. యాత్రలో రిటైర్డ్ ప్రొ.కసిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్.ఎస్.ఎస్, భాజపా, వీహెచ్‌పీ, వివిధ క్షేత్రాల సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఉస్మానియా భూములను కబ్జా చేస్తున్నారు!