ETV Bharat / state

రాఖీ బాధపడుతోంది.. ఎందుకో తెలుసా?! - etv bharat

ఇవాళ రక్షాబంధన్​... కానీ రాఖీ ఎందుకో బాధపడుతోంది. పువ్వులా వికసించే రాఖీ.. దేనికోసమో క్షోభిస్తోంది. అసలు రాఖీకొచ్చిన బాధ ఏంటి? కలుగుతున్న కష్టమేంటి? ఇంత దుఖం ఎందుకొచ్చింది..?

రాఖీ బాధపడుతోంది.. ఎందుకో తెలుసా?!
author img

By

Published : Aug 15, 2019, 5:55 AM IST

ఇవాళ రక్షాబంధన్​... కానీ రాఖీ ఎందుకో బాధపడుతోంది

రాఖీ అంటే నేనే! జీవితాంతం అండగా, రక్షణగా ఉండమని కడతారు. అందుకే ఈ వేడుక రక్షాబంధన్‌ అయింది. ఓ రకంగా ఇది నా పుట్టినరోజు. నన్ను ఏ వ్యక్తికి అయినా కడితే... కట్టిన వ్యక్తికి రక్షగా ఉండే శక్తి ​ నా దగ్గర ఉంది. కానీ నాకు ఇప్పుడు ఏడుపొస్తోంది. ఎందుకో తెలుసా....!

ఓ యువతి... కుటుంబసభ్యులకు ఇష్టం లేని పనులు చేస్తే.. పరువుకు భంగం కలిగేలా ఏదైనా చేస్తే... అప్పుడు మా నాన్నకు, అన్నకు, తమ్ముడికి నేను గుర్తుకు రాను. రక్షగా ఉంటామన్న వారే నా ప్రాణం తీస్తారు. పరువు కోసం... ఆడపిల్లల్ని చంపడానికి సైతం సిద్ధపడుతున్నారు.

ఆడపిల్లల రక్షణకు గుర్తుగా ఉండే నేను... అమ్మ కడుపులో ఆడపిల్ల అని తెలిస్తే... చాలు పురిట్లోనే గొంతునొక్కేస్తున్నారు. ఇవన్నీ కాక.. ప్రతి అన్న, తమ్ముడు, మామయ్య, బాబాయ్, చివరకు తాత వయసు వృద్ధులు కూడా అమ్మాయి ఇంట్లోంచి బయటకు వెళితే చాలు....వెకిలి నవ్వులు, విపరీత వ్యాఖ్యలు, అసభ్యప్రవర్తనలతో గడప దాటకుండా కట్టడి చేస్తున్నారు. వీళ్లంతా అన్నదమ్ములు, తాత,తండ్రులే అయినప్పుడు.. ప్రతి ఇంటి ఆడపిల్లకు భద్రతనివ్వాలి కదా? రక్షణగా నిలవాలి కదా? మరెందుకు ఇలా కాల్చుకు తింటున్నారు?

అంతేనా 9 నెలల పసిపాప నుంచి వృద్ధుల వరకు రక్షణ లేకుండా పోయింది. కదిలే బస్సుల్లోనూ భద్రత కరువైంది. బయట ఓ ఆడపిల్లను ఏడిపించే ముందు... ఇంట్లో తనకు ఓ చెల్లి, తల్లి ఉంటుందనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇక వారి చేతికి నేను ఉండటం దేనికి?

నన్ను ఒక పండుగలా ఏడాదిలో ఒక్కరోజుకే పరిమితం చేశారు. ఏడుపొస్తుంది నాకు.. ఇన్నాళ్లు ఎంత గర్వపడ్డాను... ఈ మగాళ్లలాగే. నాదేదో అద్భుతమైన జన్మ అని అనుకున్నాను. ప్రతి అమ్మాయి సంక్షేమం, శ్రేయస్సు కోసం కారణజన్మురాలిగా అవతరించానని గర్వపడ్డాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. అయినా నా కర్తవ్యం మరచిపోను.

రక్షణ... స్వీయ బాధ్యత అని తెలిసొచ్చింది. అందుకే ఇప్పటి నుంచి నన్ను మీకు మీరే కట్టుకోండి అమ్మాయిలూ! మీ భద్రత... మీ రక్షణ... మీ చేతుల్లోనే పెట్టుకోండి. సంవత్సరానికి ఒక్కసారి కాదు... ప్రతిరోజూ రక్షాబంధన్​ చేసుకుందాం. నేను మీ చేతికి ఉన్న శక్తిని, యుక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అని మరచిపోకండి.

అందరికి రక్షాబంధన్​ శుభాకాంక్షలు...........

ఇవీ చూడండి: చంద్రబాబుకు రాఖీ కట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.