Rajendranagar Murder Case Update : రాజేంద్రనగర్‌లో దారుణహత్యకు గురైన రాహుల్ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఉన్న సెలబ్రిటీ జిమ్ నుంచి బయటకు వస్తున్న రాహుల్(Rahul)ను ముగ్గురు దుండగులు రెక్కీ నిర్వహించి హత్య చేసిన ఘటన తెలిసిందే. నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి..
రాహుల్‌కు సమీప బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగినట్లు సమాచారం. కాగా ఇటీవల వేరే యువతితో రాహుల్‌కు పెళ్లి నిశ్చయం కావడంతో హత్యకు దారితీసి ఉంటుందా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను చేసుకున్నా.. తనను కూడా వివాహం చేసుకోవాలని రాహుల్‌ను అతని బంధువుల యువతి కోరగా.. ఈ విషయాన్ని సెటిల్ చేసేందుకు అజహర్ అనే మధ్యవర్తికి రాహుల్ రూ.4 లక్షలు ఇచ్చినట్లుగా సమాచారం. సెటిల్మెంట్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అజహర్‌ను డబ్బులు వెనక్కి ఇవ్వాలని రాహుల్ కోరాడని అతని బంధువులు చెబుతున్నారు.
Couple Murder Kamareddy : భర్తను కొట్టి.. భార్యకు ఉరేసి.. దారుణ హత్య.. దోపిడీ దొంగల పనేనా?
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి జిమ్ వద్ద పెప్పర్ స్ప్రే(PAPPER SPRY) కొట్టి రాహుల్‌ను హత్య చేసి నిందితులు పరారయ్యారు. ఇద్దరు వ్యక్తులు హత్య చేయగా.. మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై బయట నిల్చుని ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రాహుల్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కాగా.. అనంతరం వారి బంధువులకు అప్పగించారు. పోలీసులు వారి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. రాహుల్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Vamshi Murder Case in Jagtial : ఇటీవల జగిత్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన వంశీ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ గ్రామ యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ విషయం యువతి ఇంట్లో వారికి తెలిసిన కొద్ది రోజులకే ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. అయినప్పటికీ వంశీ, ఆ యువతి తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేస్తున్నారని యువతి కుటుంబసభ్యులు అనుమానం పెంచుకున్నారు. దీంతో అతడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా అతడిలో మార్పు కనిపించడం లేదనే కోపంతో వారు హత్య చేయాలని నిశ్చయించుకున్నారు.
అందుకోసం పథకం రచించి.. సమయం కోసం ఎదురు చూశారు. వంశీ కొల్వాయి నుంచి బైక్‌పై తుంగూర్కు వస్తుండగా ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించారు. వారి వద్దనున్న గొడ్డలి, ఇతర ఆయధాలతో విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు అక్కడికి చేరుకుని నిందితులను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా..మృతుడి బంధువులు అక్కడే ఉన్న లారీ కిందపడుకుని తమకు న్యాయం జరిగేంతవరకు కదలనివ్వబోమని నిరసన వ్యక్తం చేశారు. నిందితులకు చట్టపరంగా శిక్షపడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో చివరకు శాంతించారు.
దిల్లీలో దారుణం.. యువతి తలపై రాడ్‌తో కొట్టి హత్య.. పెళ్లికి నో చెప్పినందుకే!
Hyderabad Girl Murder Case in Bangalore : 'ఆకాంక్ష' మర్డర్ కేసు.. ప్రియుడికి లుక్ అవుట్ నోటీసు