ETV Bharat / state

'పోలింగ్ శాతంపై అనుమానాలెందుకు?' - LOKSABHA

పోలింగ్‌ శాతాలపైన అనుమానాలు రావడం పట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలింగ్‌ ఏజెంట్లు సంతకాలు చేసిన తర్వాత కూడా అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటూ ప్రశ్నించారు.

'పోలింగ్ శాతంపై అనుమానాలెందుకు?'
author img

By

Published : Apr 16, 2019, 3:10 PM IST

ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం మార్పులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ స్పందించారు. ఎప్పుడైనా పోలింగ్‌ పూర్తైన వెంటనే సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ శాతంపై అంచనా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. తర్వాత రోజు మాత్రమే పోలింగ్‌ శాతంపై స్పష్టమైన సమాచారమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఏజెంట్లందరికీ పోలింగ్‌ ముగిసిన తరువాత ఫారం 17సీ కాపీ అందిస్తామన్నారు. అనంతరం 17ఏ ఫారంపై పోలింగ్‌ ఏజెంట్లు సంతకం చేస్తారని, రిసెప్షన్‌ సెంటర్‌కు వచ్చిన తర్వాత కూడా మరోసారి పరిశీలిస్తామన్నారు. పోలింగ్‌ ఏజెంట్లు సంతకాలు చేసిన తర్వాత కూడా ఓటింగ్ శాతంపై అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటూ రజత్ కుమార్ ప్రశ్నించారు.

'పోలింగ్ శాతంపై అనుమానాలెందుకు?'

ఇవీ చదవండి: స్థానిక పోరులో బీసీలకు అన్యాయం: లక్ష్మణ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.