Rajasingh reaction to the arrests of BJP leaders: గత అసెంబ్లీ సాక్షిగా పాతబస్తీలో మెట్రోలైన్‌కు రూట్ మ్యాప్ సిద్దమైంది. నిధులు కూడా మంజూరయ్యాయి కానీ ఇంత వరకు ఎందుకు ముందుకు వెళ్లలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాతబస్తీకి మెట్రో లైన్‌ను ఎందుకు తీసుకువెళ్లడం లేదని ఆయన మండిపడ్డారు. మెట్రో కోసం బీజేపీ నేతలు దీక్షలు చేస్తే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నారని రాజాసింగ్ ధ్వజమెత్తారు.
గత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కేసీఆర్ పనులు ప్రారంభిస్తామని మాట ఇచ్చారన్నారని.. కానీ ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ అభివృద్ధి చెందితే కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్ ఉండదనే భావనతోనే అభివృద్ధి కానివ్వండం లేదని ఆయన ఆరోపించారు. పాతబస్తీ ప్రజల కోసం పోరాటం చేసేది బీజేపీ ఒక్కటేనని.. పాతబస్తీ అభివృద్ధి చెందాలంటే బీజేపీకి మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తీ చేశారు.
బీజేపీ నేతలు అరెస్టు: హైదరాబాద్‌లోని లాల్ దర్వాజ వద్ద భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మెట్రోరైలును పాతబస్తీ వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు ఈ రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. దీక్షకు ముందస్తు అనుమతి లేదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భాజపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి చేజారకుండా దక్షిణ మండలం అదనపు డీసీపీ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: