Rajasingh Tweet on Passport Verification : రెండు నెలలు గడిచినప్పటికి.. పోలీసులు తన పాస్‌పోర్టు వెరిఫికేషన్ చేయకపోవడం పట్ల గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 25న తాను పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. ఎమ్మెల్యే అయిన తనకే ఈ పరిస్థితి ఉంటే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఎందుకు వెరిఫికేషన్ ప్రాసెస్ చేయడం లేదంటూ ట్విటర్‌లో.. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి రాజాసింగ్ ట్యాగ్ చేశారు.
-
Applied for my #Passport on May 25 & still no @CPHydCity verification done
— Raja Singh (@TigerRajaSingh) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
As a Public representative, I am experiencing this delay & I am concerned about the potential impact on ordinary citizens
Why is @TelanganaDGP not processing the verifications?@MEAIndia @passportsevamea pic.twitter.com/gC1eaE5UwL
">Applied for my #Passport on May 25 & still no @CPHydCity verification done
— Raja Singh (@TigerRajaSingh) July 30, 2023
As a Public representative, I am experiencing this delay & I am concerned about the potential impact on ordinary citizens
Why is @TelanganaDGP not processing the verifications?@MEAIndia @passportsevamea pic.twitter.com/gC1eaE5UwLApplied for my #Passport on May 25 & still no @CPHydCity verification done
— Raja Singh (@TigerRajaSingh) July 30, 2023
As a Public representative, I am experiencing this delay & I am concerned about the potential impact on ordinary citizens
Why is @TelanganaDGP not processing the verifications?@MEAIndia @passportsevamea pic.twitter.com/gC1eaE5UwL
ఇటీవలే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను.. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కలిశారు. మరోవైపు రాజాసింగ్‌ను పార్టీ నుంచి అధిష్ఠానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, తన సస్పెన్షన్‌పై ఈటలతో చర్చించలేదని సమావేశం అనంతరం రాజాసింగ్ పేర్కొన్నారు.
Rajasingh Clarity on Party Change Rumors : మరోవైపు రాజాసింగ్ భారత్ రాష్ట్ర సమితిలోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. వీటిని ఆయన ఖండించారు. బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నానంటూ.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భారతీయ జనతా పార్టీని వదిలి.. ఏ పార్టీలోకి వెళ్లనని ఆయన స్పష్టంచేశారు. ధూల్‌పేట ఆసుపత్రి ఆధునికీకరణపై మాట్లాడేందుకు వైద్యాఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కలిశానని రాజాసింగ్ వివరించారు.
హరీశ్‌రావు పిలిస్తేనే వారి ఇంటికి వెళ్లి అక్కడి సమస్యలు వివరించానని రాజాసింగ్ పేర్కొన్నారు. ధూల్‌పేట ప్రభుత్వాసుపత్రిని మోడల్ ఆసుపత్రిగా చేయాలని మంత్రిని కోరానని తెలిపారు. తాను బీజేపీలోని ఉంటానని.. ఇందులోనే మరణిస్తానని పునురుద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే తనపై విధించిన సస్పెన్షన్‌ను కమలం పార్టీ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
Rajasingh Clarity on Party Change Rumors : మరోవైపు రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిని ఆయన కొట్టిపారేశారు. టీడీపీలోకి వెళ్లాలని కనీసం ఆలోచన కూడా చేయలేదని రాజాసింగ్ వివరించారు. తొలి ప్రాధాన్యత ఇచ్చేది హిందూ ధర్మానికేనని చెప్పారు. ధర్మం సేవ చేయాలనేదే తన ఉద్దేశమని.. భారతీయ జనతా పార్టీ తప్ప తనలాంటి వ్యక్తులను ఏ పార్టీ తీసుకోదని రాజాసింగ్ వివరణ ఇచ్చారు.
ఇటీవలే ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్ఠానం వేటు వేసిన విషయం తెలిసిందే. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు పోలీస్‌స్టేషన్లలో వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని.. పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది. ఈ మేరకు రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు అందులో పేర్కొంది.
ఇవీ చదవండి : Rajasingh Comments on ward offices : 'వార్డు ఆఫీసులతో ప్రజల పనులు అవుతాయన్న నమ్మకం లేదు'
Raja Singh on Uniform Civil Code : 'ఉమ్మడి పౌరస్మృతిని ఎవరూ ఆపలేరు'