ఆల్ట్ బాలాజీ ద్వారా విడుదల చేసిన 'xxx అన్ సెన్సార్డ్ సీజన్ 2' ట్రైలర్లో జాతీయ చిహ్నంతో ఉన్న భారతీయ సైన్యం యూనిఫాంను చింపిన దృశ్యం అవమానకరమైన విషయన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. దేశ సేవ కోసం రేయింబవళ్లు నిద్రపోకుండా కష్టపడతున్న దేశ వీర సైనికుల కుటుంబాలపై అసభ్యంగా చూపించారని ఆయన మండిపడ్డారు.
ఆల్ట్ బాలాజీ వ్యవస్థాపకులు ఏక్తా కపూర్, వెబ్ సీరీస్ డైరెక్టర్ పంఖురి రోద్రిగ్స్, నిర్మాత సాకేత్ సావనే, కథ రచయిత జెస్సికా ఖురానా, కళాకారులు రిబ్బి మెహ్రా మరియు అదితి కోహ్లీ పై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ నగర సీపీని కోరారు.