గోషామహల్ శాసనసభ్యుడు తిరంగ యాత్రకు సంబంధించిన మరో కేసు వీగిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవాన అనుమతి లేకుండా తిరంగ యాత్ర నిర్వహించారన్న అభియోగంపై షాఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లో 2018లో నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది.
వేర్వేరు కేసుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, సంపత్ కుమార్, తదితర నేతలు కోర్టుకు హాజరయ్యారు. కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో విచారణకు హాజరుకావాలని అంబర్ పేట శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్‌కు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
ఇదీ చదవండి: యూనివర్సిటీ భూముల్లో రోడ్డు ఎలా నిర్మిస్తారు: హైకోర్టు