ETV Bharat / state

ఆయుష్​ వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు - రాష్ట్ర ఉద్యోగ నియామకాల చట్టం

ఆయుష్ వైద్యుల పదవీ విరమణ వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచింది. అందుకు అనుగుణంగా తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టానికి సవరణ చేసింది. ఇటీవలి సమీక్షలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

Raising the retirement age of AYUSH doctors
ఆయుష్​ వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు
author img

By

Published : Aug 1, 2020, 4:34 AM IST

ఆయుష్​ వైద్యుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఉద్యోగ నియమకాల( పబ్లిక్​ ఎంప్లాయ్​మెంట్​) చట్టానికి సవరణ చేస్తూ శుక్రవారం ఆర్డినెన్స్​​ జారీ చేసింది. గతంలో వైద్యఆరోగ్య శాఖ పరిధిలో అల్లోపతి విభాగం వైద్యుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం పెంచింది.

దాన్ని తమకూ వర్తింపజేయాలని ఆయుష్​ వైద్యులు కోరగా ముఖ్యమంత్రి కేసీఆర్​ అంగీకరించారు. దీనికి చట్ట సవరణ అవసరం కావడం, సెప్టెంబరు వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం లేనందున ప్రభుత్వం ఆర్డినెన్స్​ జారీ చేసింది.

ఇవీ చూడండి: 'ఈఎస్ఐ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై వివరణ ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.