WEATHER REPORT: రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈరోజు ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 3.1 కి.మీ. ఎత్తు మధ్య విస్తరించి ఉందని వాతావరణ సంచాలకులు నాగరత్న పేర్కొన్నారు. బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. ఈరోజు బలహీన పడిందని వివరించారు.
ఇవీ చూడండి..
జంట జలాశయాలకు తగ్గిన ఉద్ధృతి.. శాంతించిన మూసీ
'అధీర్' వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం.. మరో ముగ్గురు ఎంపీలపై వేటు