రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కొన్నిచోట్ల అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ఛత్తీస్గఢ్ మీదుగా 7.6 కి. మి. ఎత్తువరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు పేర్కొంది. ఫలితంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'వర్షాలు ఆలస్యమైతే రైతన్నలు ఏం చేయాలి?'