బాలిక పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు కాజేశారని ఆరోపణలపై హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. నల్గొండ జిల్లా పెద్దవురా మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన కె. చైత్ర అనే ఆరేళ్ల బాలిక మార్చి 1న కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.
చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతుండగా రోగి కుటుంబ సభ్యుల అనుమతితోనే మిలన్ అనే ఫండ్ రైజింగ్ యాప్‌లో కొంత నిధులు సేకరించి వైద్యం అందించినట్లు చెప్పారు. పూర్తి వివరాలతో ఓ ప్రకటన విడుదల చేశారు. బాలిక చైత్ర పూర్తిగా కోలుకుంటోందని తెలిపారు. వాస్తవాలు తెలియని బాలిక మామయ్య పురుషోత్తం ఆ తర్వాత వాస్తవాలు గ్రహించి తాను చేసిన ఆరోపణలను ఉపసంహరించుకున్నాడని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపింది.
ఇదీ చదవండి: ఆరేళ్లకే అనుకోని కష్టం.. ఆడిపాడే వయస్సులో ఆసుపత్రికి పరిమితం
చిన్నారికి చికిత్స పేరుతో నకిలీ అకౌంట్.. ఆసుపత్రిపై సీసీఎస్‌లో ఫిర్యాదు