రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండురోజులుగా ఉష్టోగ్రతల్లో మార్పు కనిపిస్తోంది. మరఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి, మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయని తెలిపింది.
రేపు, ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉష్టోగ్రతలు తగ్గడంతో.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది.