ETV Bharat / state

weather report: స్థిరంగా అల్పపీడనం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం - హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు(rains) పడుతున్నాయి. రాజధాని నగరంలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, వనస్థలిపురంలో జల్లులు పడుతున్నాయి.

Rain falls in telangana
ALERT: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
author img

By

Published : Jun 14, 2021, 7:17 AM IST

Updated : Jun 14, 2021, 9:21 AM IST

రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌(Hyderabad rains)లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, వనస్థలిపురంలో జల్లులు(Rain falls) పడుతున్నాయి.

ఖమ్మంలో కూడా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచే వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రఘునాథపాలెం మండలం కూసుమంచి ఖమ్మం గ్రామీణం కొనిజర్ల చింతకాని మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

రాష్ట్రంలో ఉదయం 7 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

  • సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.7 సెం.మీ. వర్షపాతం నమోదు
  • జగిత్యాల జిల్లా జగ్గాసాగర్‌లో 12.9 సెం.మీ. వర్షపాతం
  • సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 12.5 సెం.మీ. వర్షపాతం
  • సిరిసిల్ల జిల్లా చందుర్తి మం. మర్రిగడ్డలో 11.5 సెం.మీ. వర్షపాతం
  • ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 11.3 సెం.మీ. వర్షపాతం
  • సిరిసిల్ల పెద్దూర్‌లో 11.28 సెం.మీ. వర్షపాతం నమోదు
  • జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 11.2 సెం.మీ. వర్షపాతం
  • నిజామాబాద్ జిల్లా చీమన్‌పల్లిలో 11.18 సెం.మీ. వర్షపాతం
  • భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 11.18 సెం.మీ. వర్షపాతం
  • సిరిసిల్ల జిల్లా అవునూరులో 11.15 సెం.మీ. వర్షపాతం
  • సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో 10.98 సెం.మీ. వర్షపాతం
  • కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 10.98 సెం.మీ. వర్షపాతం
  • జగిత్యాల జిల్లా గోధూరులో 10.95 సెం.మీ. వర్షపాతం
  • నిజామాబాద్ జిల్లా లక్మాపూర్‌లో 10.85 సెం.మీ. వర్షపాతం
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 10.58 సెం.మీ. వర్షపాతం
  • జగిత్యాల జిల్లా కోరుట్లలో 10.43 సెం.మీ. వర్షపాతం
  • సిద్దిపేటలో 10.10 సెం.మీ. వర్షపాతం నమోదు

రేపు కూడా వర్షాలు

బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరాల వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రాంతం నుంచి తెలంగాణ, కర్ణాటకల మీదుగా అరేబియా సముద్రం వరకూ ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావారణశాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడవచ్చని, గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.

ఇదీ చదవండి: టీకా వేసుకోరా? అయితే ఫోన్‌ బ్లాక్‌, జీతం కట్​!

Last Updated : Jun 14, 2021, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.