ETV Bharat / state

ఎడతెరిపిలేకుండా వాన.. చెరువులను తలపిస్తోన్న కాలనీలు - హైదరాబాద్​లో చెరువుల్లా మారిన కాలనీలు

నగరంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. చాలా వరకు కాలనీల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. నీరు ఇళ్లలోకి చేరడం వల్ల నిత్యావసర సరకులు కూడా తడిసిపోయాయి. కొన్ని కాలనీల్లో చేరిన నీటితో ప్రజలు కనీసం ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.

ఎడతెరిపిలేకుండా వాన.. చెరువులను తలపిస్తోన్న కాలనీలు

author img

By

Published : Sep 26, 2020, 6:18 PM IST

Updated : Sep 26, 2020, 6:53 PM IST

గ్రేటర్ పరిధిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశామని.. ఆ నీటిని బయటకు ఎత్తిపోశామని కాలనీవాసులు కన్నీళ్లు పెట్టుకున్నారు. బేగంటపేట్​లోని మయూరి మార్గ్​లోకి భారీగా వరదనీరు చేరుకుంది. ఈ ప్రాంతంలోని వారు నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు.

rain-effect-on-greater-hyderabad-and-people-facing-problems
కాలనీల్లోకి చేరిన వరద నీరు

పొంగిపొర్లుతున్న గౌడవెళ్లి వాగు

అంబర్ పేట్ ప్రధాన రహదారి కింగ్స్ ప్యాలెస్ హోటల్ ముందు ఉన్న చెట్టు వర్షానికి కూలిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వచ్చి చెట్టును తొలగించారు. మీర్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్​లోని లెనిన్ నగర్ , ప్రశాంత్ నగర్ కాలనీల్లో భారీగా వరదనీరు చేరింది. మేడ్చల్ జిల్లా గౌడవెళ్లి సమీపంలో వాగు పొంగి పొర్లుతుండటం వల్ల మేడ్చల్​కు గౌడవెల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. సరూర్ నగర్​ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. ఈ వర్షానికి మల్లన్నగుట్టలో పాత ఇంటి గోడ కూలిపోయింది.

ప్రవహిస్తోన్న వరద నీరు

గరిష్ఠానికి చేరిన సాగర్ నీటిమట్టం

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్​లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.60 మీటర్లుగా ఉంది. హుస్సేన్ సాగర్ గేట్లు పైకి ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు.

చెరువులా మారిన కాలనీ

రంగారెడ్డి జిల్లాలో ఒకరు గల్లంతు

ప్రధాన రహదారులే కాదు.. కాలనీల్లో కూడా వర్షానికి నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలనీలు చెరువుల్లా మారిపోవడం వల్ల ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక అవస్థలు పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని విశ్వనాథ్ పూర్ వాగులో పడి జహంగీర్ అనే వ్యక్తి గల్లంతయ్యారు. జహంగీర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సురారం చెరువు కింద ఉన్న నాలా నిండిపోయింది. గాజులరామారం మోదీ బిల్డర్స్​లోని నీళ్లు పక్కనున్న ఒక్షిత్ ఎంక్లేవ్ లోకి వదులుతుండటం వల్ల తమ కాలనీలోకి పాములు, క్రిములు, కీటకాలు వస్తున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

వాహనదారుల ఇబ్బందులు

ఇదీ చదవండి: అలర్ట్: బయటకు వెళ్తే.. గొడుగు తీసుకెళ్లడం మరవొద్దు..!

Last Updated : Sep 26, 2020, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.