రైల్వే పార్సెల్ కౌంటర్లో పనిచేస్తున్న వలస కార్మికులను ఆదుకునేందుకు రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ముందుకొచ్చింది. దాదాపు వందమంది వలస కార్మికులకు సంఘ్ సభ్యులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ప్రస్తుతం పది రోజులకు సరిపడా సరుకులను కార్మికులకు అందజేసినట్లు స్టేషన్ డైరెక్టర్ జయరాం తెలిపారు. ఒకవేళ లాక్డౌన్ గడువు పొడిగిస్తే వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వారికి తమవంతు సాయం చేస్తున్నామన్నారు.