ETV Bharat / state

పండగ పేరుతో రైల్వే బాదుడు.. వలస కార్మికులపై అదనపు ఛార్జీలు - వలస కార్మికుల ఇబ్బందులు

కరోనా కాలం.. ఉద్యోగాలు లేక, ఆదాయాలు తగ్గి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వలసకూలీల కష్టాలైతే వర్ణనాతీతం. ఈ సమయంలోనూ రైల్వేశాఖ ఛార్జీలను భారీగా వడ్డిస్తోంది. ‘పండగ’ రైళ్ల పేరుతో సామాన్య ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతోంది.

railway-charges-extra-from-migrant-labour-in-the-name-of-the-festival
పండగ పేరుతో రైల్వే బాదుడు.. వలస కార్మికులపై అదనపు ఛార్జీలు
author img

By

Published : May 26, 2021, 9:01 AM IST

దసరా, దీపావళి, సంక్రాంతి సమయాల్లో నడిపే రైళ్లను కరోనా కాలంలో అదనపు ఛార్జీలతో నడుపుతోంది రైల్వేశాఖ. పరిశ్రమలు, ఇంటినిర్మాణం, ఇంటీరియర్‌ డిజైనింగ్‌, మిఠాయి దుకాణాలు, హోటళ్లు... ఇలా ప్రతిచోటా వారే. హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో లక్షల సంఖ్యలో వలసకూలీలు ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి వెళ్లి ముంబయి, గుజరాత్‌ వంటి ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నవారు వేలాదిగా ఉన్నారు. లాక్‌డౌన్‌, కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి భయంతో వారంతా సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు.

అధిక ఛార్జీలు

వలస కూలీలు ప్రయాణాలు చేసే మార్గాల్లో జనరల్‌, స్లీపర్‌ బోగీలతో, సాధారణ ఛార్జీలతో రైళ్లు నడపాల్సిన ఆ శాఖ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. భారీ అదనపు ఛార్జీలతో థర్డ్‌, సెకండ్‌, ఫస్ట్‌ ఏసీ బోగీలతోనూ ‘పండగ’ ప్రత్యేక రైళ్లను నడుపుతూ ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకుంటోంది. ఇప్పటికే రెగ్యులర్‌ రైళ్లను ‘ప్రత్యేక’ పేరుతో నడిపిస్తూ సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు సహా వివిధ వర్గాలకు ఉన్న రాయితీల్ని తొలగించిన రైల్వే ఇప్పుడు ‘పండగ’ అంటూ భారీగా ఛార్జీలు పిండుకుంటోంది. సాధారణంగా రెగ్యులర్‌ కంటే ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు రూ.100 నుంచి రూ.300 వరకు అదనంగా ఉంటాయి. వీటికంటే ‘పండగ ప్రత్యేక’ రైళ్లలో ఛార్జీలు మరింత ఎక్కువగా ఉంటాయి. కానీ సదుపాయాలు, సేవల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు వీటిని నడిపించడం సామాన్య, పేద ప్రయాణికులకు పెనుభారంగా మారుతోంది. దీనికితోడు సరిపడినన్ని సెకండ్‌ క్లాస్‌, స్లీపర్‌ బోగీలు వేయకపోవడంతో జనరల్‌, స్లీపర్‌ ప్రయాణాలనే ఎంచుకునే వలసకార్మికులు మరో దారి లేక ఆర్థికంగా భారమైనా థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ-టికెట్లు కొని ప్రయాణాలు చేయాల్సివస్తోంది.

ప్రత్యేక రైళ్ల ధరలు

సికింద్రాబాద్‌ నుంచి బిహార్‌లోని దానాపూర్‌కు ప్రత్యేక రైల్లో (నెం.02791) టికెట్‌ ధర స్లీపర్‌ రూ.745, థర్డ్‌ ఏసీ రూ.1,945 ఉంటుంది. ‘పండగ’ ప్రత్యేకరైల్లో (నెం.02787) స్లీపర్‌ రూ.915. అంటే రూ.170 అదనం. థర్డ్‌ ఏసీ- రూ.2,295. అంటే రూ.350 అదనం. స్లీపర్‌ బోగీలు తగినన్ని లేకపోవడంతో టికెట్లు దొరకని వారు మరోమార్గం లేక ఏసీ టికెట్లు కొనాల్సి వస్తోంది. నలుగురు ఉన్న కుటుంబం వెళితే రూ.9,180 అవుతుంది.

సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కు ప్రత్యేక రైల్లో (నెం.02704) ఛార్జీలు స్లీపర్‌ రూ.550, థర్డ్‌ ఏసీ- రూ.1435, సెకండ్‌ ఏసీ- రూ.2,045. పండగ ప్రత్యేక రైల్లో స్లీపర్‌ రూ.675. థర్డ్‌ ఏసీ రూ.1,775, సెకండ్‌ ఏసీ- రూ.2,445. తరగతులవారీగా రూ.124, రూ.340, రూ.400 అదనం అన్నమాట. ఇదే పరిస్థితి పశ్చిమబెంగాల్‌, ఇతర రాష్ట్రాల వైపు వెళ్లే రైళ్లలోనూ ఉంది.

ఇదీ చూడండి: రెండో డోసు కోసం టీకా కేంద్రాలకు పోటెత్తిన లబ్ధిదారులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.