ETV Bharat / state

పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లను చైతన్యం చేయండి : పార్థసారథి - హైదరాబాద్ వార్తలు

గ్రేటర్​ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు రేడియో సంస్థలు ఓటర్లను చైతన్య పరచాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కోరారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆల్ ఇండియా రేడియో, నగరంలోని ఎఫ్​ఎమ్​ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Radio companies motivate voters to use their vote ghmc elections says election commissioner parthasarathi
పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లను చైతన్యం చేయండి : పార్థసారథి
author img

By

Published : Nov 27, 2020, 9:51 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోలింగ్​శాతం పెరిగేలా రేడియో సంస్థలు ప్రధాన పాత్ర పోషించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కోరారు. గత ఎన్నికల్లో 50 శాతం కూడా మించలేదని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో పలు రేడియో కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

గ్రేటర్ పరిధిలో విద్యావంతులు, సాఫ్ట్​వేర్ ఉద్యోగులు అధికంగా ఓటింగ్​లో పాల్గొనేలా చైతన్యపరచాలని సూచించారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో చేపడుతున్న చర్యలపై ప్రసార మాధ్యమాలు అవగాహన కల్పించాలన్నారు. ఒక్కరోజు ఓటు వేయండి..ఐదేళ్లు సౌఖ్యంగా ఉండండి అంటూ ఓటర్లను చైతన్యపరచాలని పార్థసారథి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఎన్నికల విధులకు గైర్హాజరైనవారిపై చర్యలు: లోకేశ్​కుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.