లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకుండా రాచకొండ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటోలు, క్యాబ్ సర్వీసులు లేకపోవడం వల్ల పోలీసులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు. మహీంద్రా లాజిస్టిక్స్‌తో కలిసి కమిషనరేట్ పరిధిలో ఏడు వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో పాటు మద్యం దొరక్క వింతగా ప్రవర్తిస్తున్నవారికోసం ప్రత్యేక మానసిక నిపుణుల బృందాన్ని నియమించారు. ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని... లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు.
ఇదీ చూడండి : కరోనా కాలంలోనూ 14 నెలల పాపతో పోలీసు విధుల్లోకి!