రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పథకాలు, సేవా పథకాలను అందుకున్న 35 మంది పోలీస్ అధికారులను రాచకొండ సీపీ (Rachakonda CP) మహేష్ భగవత్ సత్కరించారు. పతక విజేతలందరూ మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారిని చాలా మంది గమనిస్తూ ఉంటారని, సరిగా ప్రవర్తించాలని చట్టానికి అనుగుణంగా పనిచేయాలని సీపీ హెచ్చరించారు.
రివార్డులు, పురస్కారాలు అందుకున్న పోలీసులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ ప్రోత్సహించారు. పోలీస్ అధికారులు నిలకడగా పనిచేయాలని, ప్రతిరోజూ కొత్త శక్తితో ప్రారంభించాలని ఉత్తేజపరిచారు. అధికారులందరు సహనం, ఓర్పుతో బాధ్యతలు నిర్వర్తించడంలో మరింత కృషి చెయ్యాలని భగవత్ సూచించారు.
అవార్డు గ్రహీతలను అభినందించిన అడిషనల్ సీపీ సుధీర్ బాబు... ఈ అవార్డులు వారి సేవకు గుర్తింపు అని కొనియాడారు. యూనిఫామే పోలీసులకు అతిపెద్ద బహుమతి అన్నారు.
ఇదీ చూడండి: Free Ration: ప్రారంభమైన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ